ఆచార్య, రాధే శ్యామ్, పుష్ప వంటి భారీ టాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా నిలిచిపోయాయి. కానీ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమా మాత్రం కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలోనూ నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాతో పాటు నాని హీరోగా నటిస్తున్న "శ్యామ్ సింగ రాయ్" సినిమా షూటింగ్ కూడా కరోనా సమయంలోనూ కొనసాగుతూనే ఉంది.