అమ్మతనం అంతులేని మాధుర్యం. మాటల్లో వర్ణించలేనిది. ఎన్ని యుగాలు గడిచినా అమ్మ రుణం తీర్చుకోలేనిది. అమ్మ అన్న రెండు అక్షరాల పదంలో ఎంతటి మాధుర్యం దొరుకుతుందో మాట్లో చెప్పలేనిది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలకు ప్రేమ పంచటంలో అమ్మకు మరెవరూ సాటిరారనేది నిత్య సత్యం.