ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో కేవలం కామెడీ మాత్రమే చేస్తారనుకోవడం భ్రమ. అయితే కామెడీ చేసేవాళ్లు ఏదైనా చేయగలరని బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్లు చాలా సార్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కమెడియన్లు ఏ ఎమోషన్ అయినా పండిస్తారు కానీ అందరూ హాస్యం పండించలేరని ఆయన చెబుతుంటారు.