తెలుగు ఇండస్ట్రీలో కామెడీన్స్ చాలా మంది ఉన్నారు..ఒకప్పుడు లేడీ కమిడియన్స్ గిరిజ,సూర్యకాంతం,రమాప్రభలు బాగా పాపులారిటీ సంపాదిస్తే ఇప్పుడు నటి హేమ మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది.  తెలుగు తెరపై  బ్రహ్మానందం, హేమ కాంబినేషన్ వచ్చిన కామెడీ చూస్తే పొట్ట చెక్కలయ్యేది.  ప్రస్తుతం అత్తా, తల్లి పాత్రలు చేస్తున్న హేమ `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) జాయింట్ సెక్ర‌ట‌రీ కొనసాగుతుంది.  
Image result for actress hema
ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా తెచ్చుకున్న హేమ ఆప్పట్లో ‘మా’ ఎలక్షన్స్ సందర్భంగా పెద్ద హంగామా చేసిన విషయం తెలిసిందే.  ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే ఈమె అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  తాజాగా నటి హేమ  కోళ్ల కృష్ణ వేణి అలియాస్ హేమ‌ అధికారికంగా పేరు మార్చుకుంటున్న‌ట్లు తెలిపారు.  వాస్తవానికి ఇండస్ట్రీలోకి రాక ముందు హేమ అసలు పేరు కోళ్ల కృష్ణవేణి.  కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హేమగా పేరు మార్చుకుంది..అదే పేరుతో పాపులర్ అయ్యింది.
Image result for actress hema movie association
తాజాగా కొళ్ల కృష్ణ వేణి అ న బడే నేను కోళ్ల హేమ గా పేరు మార్చుకున్నాను. కావునా ఇక పై నన్ను కోళ్ల హేమ గా స్వీ కరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.ఆమె టైమింగ్ పెర్పామెన్స్ కు ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో సినిమాల్లో న‌టించారు. స్టార్ హీరోల నుంచి ఇప్ప‌టి యంగ్ హీరోల సినిమాల వ‌ర‌కూ హేమ భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: