ఎన్టీఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తారక్ నటించిన జై లవకుశ సినిమాలో రావణ పాట ఎంత పాపులర్ అయిందో అందరికే తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ ట్యూన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్ కూడా అంతగా పాపులర్ అయింది. ఇప్పుడు ఆ పాట టైటిల్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు ఇచ్చిన కథతో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. కాస్త ఎక్కువ బడ్జెట్ తో తయారయ్యే ఈ సినిమా కథ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని ఫ్రెష్ అప్‌డేట్.

ఈ సినిమాకు రావణ అనే టైటిల్ అయితే యాప్ట్ గా వుంటుందని యూనిట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ అనుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ ఆ టైటిల్ అయితే సినిమా మేకింగ్ పరంగా కొన్ని సమస్యలు వస్తాయని, అదీకాక మాస్ లో పవర్ ఫుల్ గా వుండకుండా, ఫన్నీగా వుంటుందని, అందుకే రావణ అంటే పవర్ ఫుల్ గా వుండడమే కాకుండా, మేకింగ్ లో కాస్త భారీతనం కనిపించేలా చేయడానికి ఆస్కారం వుంటుందని అనుకుంటున్నారట చిత్ర బృందం.

ఇవన్నీ ఫైనల్ అయితే ఖచ్చితంగా రావణ అనే టైటిల్ తో కళ్యాణ్ రామ్ సినిమా అనౌన్స్ అవుతుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా మధ్యలోనే ఈ సినిమా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం వుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మధ్య 118 తో యావరేజ్ హిట్ ని సొంతం చేసుకున్న తన నెక్స్ట్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు తన తమ్ముడు తారక్ తో కూడా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: