‘కొబ్బరిమట్ట’ ఊహించని ఘన విజయం సాధించడంతో ఆమూవీని ప్రమోట్ చేస్తూ సంపూర్ణేష్ బాబుతో పాటు షకీలా కూడ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ మూవీలో సంపూర్ణేష్ కి తల్లిగా నటించిన షకీలా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలియ చేసింది. 

తనను చూసి ఎవరైనా జాలిపడితే తనకు చాల చికాకు అని చెపుతూ ఇప్పటి వరకు తాను గర్వంగా చెప్పుకునేంత ఏ పనులు చేయలేదు అని కామెంట్ చేసింది. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురు దెబ్బలు తగిలిన విషయాలను వివరిస్తూ తనను చాలా మంది మోసం చేసారు కాని తాను ఎవర్ని ప్రత్యేకంగా మోసం చేయలేదు అంటూ జోక్ చేసింది. 

వాస్తవానికి తాను నమ్మక ద్రోహానికి గురైనా తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు అని చెపుతూ తాను ఎక్కడైతే అవమానించపడ్డానో అదే ఫిలిం ఇండస్ట్రీలో తాను రాణించిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ వచ్చే జన్మలో కూడ తాను షకీలా లాగే పుడతాను అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని బయటపెట్టింది. ఇక ఇదే సందర్భంలో క్యాస్టింగ్ కోచ్ వివాదం పై షకీలా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

వివిధ రంగాలలో బయటకు వచ్చే మహిళలకు అనేక చోట్ల వేధింపులు ఎదురౌతాయని తనకు కూడ అటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకుని పోరాటం చేసిన విషయాన్ని తెలుపుతూ షకీలా శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. తాను కెమెరా ముందు అర్ధనగ్నంగా నటించే విషయంలో సమస్యలు ఎదురైనా శ్రీరెడ్డిలా బట్టలు విప్పుకుని రోడ్డు పై నిలబడలేదు అంటూ మహిళలకు ఆత్మవిశ్వాసం ధైర్యం చాల అవసరం అన్న విషయాన్ని తెలియచేసింది. అయితే తనను టార్గెట్ చేసే ఏవ్యక్తిని వదలని శ్రీరెడ్డికి షకీలా కామెంట్స్ తెలిస్తే ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: