చిరంజీవి ఇప్పట్లో ఏ తెలుగు హీరో అందుకోలేని రికార్డులను అందుకుని అత్యున్నత స్థానంలో ఉన్నాడు. ఆయన రాజకీయాలలోకి వెళ్లిపోయి తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి తిరిగి సినిమాలు చేసినా ఆయన సినిమాలను భుజాన పై ఎత్తుకుని మోసే వీరాభిమానులు ఉన్నారు. 

అలాంటి చిరంజీవి ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకుల వద్దకు వెళ్ళి తన ‘సైరా’ ను చూడమని ఎందుకు అడుగుతున్నాడు అంటూ కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు. వాస్తవానికి ‘సైరా’ పొలిటికల్ మూవీ కాదు. ఒక స్వాతంత్ర సమరయోధుడి జీవితం పై తీసిన మూవీ. 

దీనికితోడు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అంటూ చెపుతున్న చిరంజీవి ఇప్పుడు ప్రముఖ రాజకీయనాయకులు అందర్నీ వారు పిలవకుండానే కలిసి తనంతట తానుగా తన ‘సైరా’ చూడండి అని ప్రమోట్ చేసుకోవడం ఒకవిధంగా చిరంజీవి స్థాయిని తగ్గించే విషయం అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి కొందరైతే ‘సైరా’ మూవీలో చిరంజీవి నటనకి నేషనల్ అవార్డ్ ఆశించి ఇలా ప్రముఖ రాజకీయనాయకులందరి వద్ద ‘సైరా’ ను వ్యూహాత్మకంగా ప్రమోట్ చేస్తున్నాడా అంటూ మరికొందరి కామెంట్స్. 

వాస్తవానికి ‘సైరా’ తెలుగు రాష్ట్రాలలో కూడ ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కి రాలేదు. ఇక ఓవర్సీస్ బాలీవుడ్ లలో ఈ మూవీ బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలలో ‘సైరా’ అద్భుత విజయం సాధించింది అంటూ చిరంజీవి చెప్పడమే కాకుండా అనేకమంది ప్రముఖులను కలవడం బట్టి ‘సైరా’ కు కనీసం ఈపాటి విజయం కూడ దక్కుతుందని అనుకోక పోవడమే ఈ ఆనందానికి కారణమా అంటూ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలను కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమైనా బయ్యర్లు పూర్తిగా ఆనందంగా లేకపోయినా ‘సైరా’ విషయమై చిరంజీవి మాత్రం పూర్తి సంతృప్తితో ఉన్నాడు అన్న మాట వాస్తవం..   


మరింత సమాచారం తెలుసుకోండి: