నిన్న విడుదలైన
రామ్ గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో
కడప రెడ్లు’ ట్రైలర్
సినిమా ఎంతవరకు విజయవంతం అవుతుంది అన్న విషయమై క్లారిటీ ఇవ్వలేకపోయినా ఈ ట్రైలర్ లో కనిపించిన చంద్రబాబు
పవన్ పాత్రలు అందర్నీ ఆకర్షించాయి. ఈ ట్రైలర్ లో చంద్రబాబు
జగన్ లోకేష్ కెఎ పాల్ లాంటి ప్రముఖ వ్యక్తులతో పాటు లోకేష్
భార్య బ్రాహ్మణి ఆఖరికి చంద్రబాబు మనవడు దేవాన్ష్ లకు చోటు కల్పించిన వర్మ బాలకృష్ణను మర్చిపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.
ఇప్పుడు ఈ విషయాన్నే మెగా అభిమానులు తెర పైకి తీసుకు వచ్చి వర్మ బాలయ్యను ఎందుకు వదిలేసాడు అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. వాస్తవానికి వర్మ కూడ మెగా బ్రదర్స్ ను టార్గెట్ చేసినంతగా
బాలయ్య పై ఎప్పుడూ పెద్దగా సెటైర్లు వేయలేదు.
అదేవిధంగా
బాలయ్య కూడ ఎప్పుడు వర్మ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. దీనితో వర్మకు
బాలయ్య పై కోపం లేదా అని అనిపించడం ఎవరికైనా సహజం. అయితే తెలుగుదేశప్రభుత్వ నిర్ణయాలలో ఎప్పడు
బాలయ్య పెద్దగా ప్రభావితం చేసినట్లు వార్తలు రాలేదు. దీనితో వర్మ కనికరించి బాలయ్యను పట్టించుకోలేదు అనుకోవాలి. మెగా అభిమానుల ప్రశ్నల ఒత్తిడిఎక్కువైన సందర్భంలో వర్మ బాలయ్యను కూడ ఈ మూవీలో టార్గెట్ చేసి సమన్యాయం పాటించి మెగా ఆభిమానులకు కోపం లేకుండా ప్రవర్తిస్తాడు అనుకోవాలి.
అయితే వర్మ చేసే కామెంట్స్ మాత్రమే కాదు అతడు తీసే సినిమాలు కూడ పూర్తిగా క్లారిటీ లోపిస్తున్న పరిస్థితులలో వర్మ లేటెస్ట్ గా తీస్తున్న ఈ మూవీలో హడావిడి తప్ప విషయం ఏమి ఉండక పోవచ్చు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి రానున్న రోజులలో ఈ
మూవీ క్రేజ్ పెంచి భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోవడానికి ఇంకా ఎలాంటి ట్విస్ట్ లు ఇచ్చి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలా షేక్ చేస్తాడో చూడాలి..