స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో తారాస్థాయి అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో నివేదా పేతురాజ్, టబు, సుశాంత్, నవదీప్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమా నుండి రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మూడు సాంగ్స్ ఒకదానికి మించి ఒకటి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.  

 

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రయూనిట్ త్వరలోనే ఓ అదిరిపోయే టీజర్ తో సర్ ప్రైజ్ ఇవ్వనుందట. ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒకడా ఇద్దరా అన్న డౌట్లు వస్తున్నాయి. సినిమాలో బన్ని ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కొందరు అంటున్నారు. కాని కొందరేమో కాదు అల్లు అర్జున్ చేసే ఒక పాత్రే అంటున్నారు. 

 

లేటెస్ట్ గా ఈ సినిమాను త్రివిక్రం ఒకప్పటి క్లాసిక్ మూవీ ఇంటి గుట్టు సినిమా స్పూర్తితో తీస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో అల్లు అర్జున్ ఓ పక్క పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తూనే మర్పక్క సూటు బూటు వేసుకుని సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. సినిమాలో బన్ని, పూజాల రొమాన్స్ కూడా అదిరిపోతుందని తెలుస్తుంది. 

 

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రం కాంబోలో వస్తున్న ఈ మూవీ హ్యాట్రిక్ హిట్ కొట్టేలా ఉన్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా చేస్తున్నా కాజల్ అగర్వాల్ తో క్రేజీ ఐటం సాంగ్ ప్లాన్ చేశారట. సినిమాకు ఆ సాంగ్ కూడా హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి బన్ని, త్రివిక్రం ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: