టీమిండియాలో సీనియర్ స్పిన్నర్ గా గుర్తింపును సంపాదించుకున్న రవిచంద్రన్ అశ్విన్ తన ఆటతీరుతో ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అటు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు వరల్డ్ క్రికెట్లో ఉన్న దిగ్గజ స్పిన్నర్ లలో తను కూడా ఒకడిగా చేరిపోయాడు. అయితే అశ్విన్ తెలివైన బౌలర్గా గుర్తింపును సంపాదించుకున్నారు. ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కు ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు. అందుకే ఇక అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే పరుగులు చేయడం కాదు వికెట్ కాపాడుకోవాలని అనుకుంటున్నారు బ్యాట్స్మెన్లు.


 అందుకే ఏకంగా జట్టు కెప్టెన్స్ సైతం స్పిన్నర్ అయిన అశ్విన్ ను ఏకంగా పవర్ ప్లే లో బౌలింగ్ చేయించడం లాంటివి కూడా కొన్ని కొన్ని సార్లు చూస్తూ ఉంటాం. అయితే ఇలా క్రికెట్లో ఇప్పటివరకు తాను ఒక అద్భుతమైన ఆటగాడిని అని నిరూపించుకున్న రవిచంద్రన్ అశ్విన్ ఎందుకో ఈ ఏడాది ఐపీఎల్ సీజర్ లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు అనుకుంటే వికెట్లు తీయడంలో వెనకబడిపోతున్నాడు. అయితే పరుగులు కట్టడి చేస్తున్న వికెట్లు రాకపోతూ ఉండడంతో అతనిపై విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి.


 ఇలా రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటతీరులో దూకుడు లేకపోవడంపై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. అశ్విన్ ఆటలో దూకుడు ఎక్కడ కనిపించడం లేదు అంటూ విమర్శలు గుప్పించాడు. వికెట్లు తీయడం లేదు అంటూ మండిపడ్డారు. అశ్విన్ ఈ తీరులో ఆడాలనుకుంటే నేనైతే జట్టులో చోటే ఇవ్వను. తన తోటి బౌలర్లు చాహల్, కుల్దీప్ వికెట్లు తీస్తూ దూకుడు చూపిస్తుంటే.. అటు అశ్విన్ మాత్రం వెనకబడి పోతున్నాడు. ఆఫ్ స్పిన్ వదిలేసి ఇక క్యారం బాల్స్ వేస్తున్నాడు అశ్విన్. తన మైండ్ సెట్ మార్చుకుంటే బెటర్ అంటూ సెహ్వాగ్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: