సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ముద్దుగుమ్మలకు ఎంత మంచి టాలెంట్ ఉన్నప్పటికీ లక్కు  కూడా బాగా కలిసి రావాలి. చాలా మంది హీరోయిన్లు తమ లక్కు  తోనే సినిమాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. తమా  సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా సినిమా అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక మన దక్షిణాదిలో చాలా హీరోయిన్ల కొరతాయే.. ఇంకేముంది ఫ్లాప్ అయినా హిట్ అయిన దర్శకులు  అందరికీ అదే హీరోయిన్లు దిక్కు అందుకే ఉన్న కొంతమంది హీరోయిన్లు వరస సినిమా లతో దూసుకు పోతున్నారు. ఇక ఈ 2019 సంవత్సరం ముగిసి పోతున్న సమయంలో.. ఈ ఏడాది వరుస అవకాశాలు అందుకుని బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ లు  ఎవరో  ఇప్పుడు తెలుసుకుందాం. 

 

 

 

 

 అనుష్క.. బాహుబలి సినిమా తర్వాత అనుష్క సినిమాలకు దూరం గానే ఉందని చెప్పాలి. మధ్యలో ఒక భాగమతి సినిమా మాత్రమే చేసింది. ఇక ఈ సంవత్సరం కేవలం సైరా నరసింహారెడ్డి లో చటుక్కున కనిపించి లటుక్కున మాయమైపోయింది. కేవలం అతిథి పాత్రలో మాత్రమే కనిపించింది అనుష్క. అయితే ప్రస్తుతం నిశ్శబ్దం  అనే సినిమాలో నటిస్తోంది అనుష్క  అయితే ఈ ఒక్క సినిమా తప్ప మరే సినిమాలు కూడా అనుష్క ఒప్పుకోలేదు. దీంతో టాప్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క కాస్త కొంచెం కొంచెం గా క్రేజ్  తగ్గిపోతూ వస్తుంది. 

 

 

 అక్కినేని కోడలు సమంత... అబ్బో మీ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతి సంవత్సరం ఈ అమ్మడికి ఫేవరెట్. ఎందుకంటే ప్రతి యేడు వరుస ఆఫర్లు ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఇక ఈ సంవత్సరం విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభంలోనే మజిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఓ బేబీ సినిమా తో మరో అద్భుత విజయాన్ని అందుకుంది సమంత. ఇక మన్మధుడు 2 లో కూడా గెస్ట్ రోల్ లో మెరిసింది. తమిళంలో సమంత నటించిన సూపర్ డీలక్స్ సినిమా కు నటిగా మంచి మార్కులు అందుకుంది సమంత. ఇక వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు. 

 

 

 

 మిల్కీ బ్యూటీ తమన్నా... ఈ అమ్మడికి సినిమా అవకాశాలు చాలానే వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం అంతగా కలిసి రాలేదు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ.. ఈ సినిమాలో తమన్నా పాత్ర మాత్రం అంతంత మాత్రమే. ఇక సైరా నరసింహారెడ్డి లో మంచి పాత్రలో నటించింది తమన్నా. వీరనారిగా తన నటనకు ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన అభినేత్రి 2 అభిమానులను నిరాశ పరిచింది. తమన్న తమిళంలో నటించిన పెట్రోమాక్స్ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణకు కోల్పోయింది. కాగా 2020 సంక్రాంతికి మళ్లీ తమన్నా కనిపించబోతోంది.. ఎక్కడ అనుకుంటున్నారా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో  ప్రత్యేక గీతంలో మెరవేరబోతోంది తమన్నా. 

 

 

 అందాల ముద్దుగుమ్మ కాజల్... ఈ అమ్మడికి వరుస  సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ..ఈ  ఏడాది మాత్రం అంతగా కలిసి రాలేదు. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో  నటించిన సీత సినిమా ఈ అమ్మడికి నిరాశే మిగిల్చింది. ఇక శర్వానంద్ తో నటించిన రణరంగం సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ కరువవడంతో ఫ్లాప్ అయిపోయింది. ఇక రణరంగం సినిమాలో కాజల్ తన స్థాయికి తగని పాత్రలో నటించింది. అయితే ప్రస్తుతం కాజల్ నటిస్తున్న రెండు సినిమాలు 2020లో విడుదలకు సిద్ధం అవుతున్నాయి.  ప్రస్తుతం ఆ సినిమాల పైనే కాజల్ ఆశలు ఉన్నాయి. విలక్షణ నటుడు కమల్ హాసన్ సరసన నటిస్తున్న భారతీయుడు2.. విష్ణు తో మరో సినిమాలో నటిస్తుంది కాజల్. 

 

 

 కీర్తి సురేష్... హీరోయిన్ అందరిలో తెగ బిజీ అయిపోయిన హీరోయిన్ కీర్తి సురేష్. అయితే ఈ అమ్మడు సంబంధించి 2019లో మాత్రం ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ వరుస  సినిమా షూటింగులతో బిజీగా ఉంది ఈ అమ్మడు. 2020 పై భారీగానే ఆశలు పెట్టుకుంది. 

 

 

 

 రష్మిక మందన.. చేసినవి తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ అమ్మడు... తెలుగులో కన్నడంలో వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ అమ్మడు. అయితే ఈ ఏడాది ఈ అందాల ముద్దుగుమ్మ కి అంతగా కలిసి రాలేదు ఎందుకంటే.. క్రేజీ కాంబినేషన్ అయిన విజయ్ దేవరకొండ తో జోడీ కట్టి డియర్ కామ్రేడ్ లో నటించినప్పటికీ ఆ సినిమా మాత్రం హిట్ కాలేకపోయింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు లో నటిస్తుంది. 2020 సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదల కానుంది. అంతేకాకుండా నితిన్ కి జోడిగా భీష్మ సినిమాలో నటిస్తోంది. 

 

 

 పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ అమ్మడు. ఈ ఏడాది ఈ అమ్మడికి మంచి విజయాలే ఖాతాలో వేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన మహర్షి సినిమా మంచి విజయం అందుకుంది.. ఇక ఆ తర్వాత మెగా హీరోతో గద్దల కొండ గణేష్ సినిమాలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో  సినిమాలో నటిస్తూ వచ్చే సంక్రాంతికి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైనది  ఈ అమ్మడు. 

 

 

 రాసి కన్నా.. ఓ వైపు యంగ్ హీరోలు మరో సీనియర్ హీరోల సరసన నటిస్తూ తనదైన స్టైల్లో మెప్పిస్తుంది ఈ అమ్మడు. ఈ ఏడాది అంతా బిజీ బిజీగా గడిపింది రాసి కన్నా. తాజాగా విడుదలైన వెంకీమామ లో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రతి రోజు పండుగ సినిమాలో మెగా హీరో తో జోడి కట్టినది  ఈ అమ్మడు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో కూడా వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 2020 లో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: