మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్ కొద్ది సినిమాలుగా గందర గోళంలో పడింది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లతో దూసుకుపోయిన సాయి తేజ్ అక్కడ నుంచి వరుస ప్లాపులతో డీలా పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వరుస ప్లాపులతో కెరీర్‌లో వెనకపడిపోయారు. సాయి మార్కెట్ మొత్తం ఖల్లాస్ అయ్యింది. అసలు సాయి సినిమా వస్తుందంటేనే పట్టించుకునే వాడే లేకపోయాడు.
ఇక వరుసగా ఆరు ప్లాపులు రావడంతో పూర్తిగా డీలా పడ్డ సాయి కెరీర్‌కు చిత్రలహరి సినిమా సరికొత్త ఊపిరిలూదింది. ఈ యేడాది వచ్చిన ఆ సినిమా హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు సాయి తన కొత్త చిత్రం ప్రతిరోజు పండగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది.
సినిమా స్టిల్స్, టీజర్లు, ట్రైలర్, పాటలు అన్నీ బాగుండటంతో చిత్రం కూడా అలరిస్తుందనే నమ్మకం ఏర్పడింది అందరిలో. పైగా తేజ్ గత చిత్రం ‘చిత్రలహరి’ హిట్ కావడంతో సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందట. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సుమారు రూ.17 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రావాలన్నా.. ఈ మొత్తం షేర్ రాబట్టాలి అన్నా ప్రతిరోజు పండగే భారీ హిట్ అవ్వాలి. తేజ్ గత సినిమా ‘చిత్రలహరి’ వసూళ్లు చూస్తే రూ.13 కోట్ల వరకు టచ్ అయింది. దీనిని బట్టి ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చి.. ఫ్యామిలీస్ కు ఎక్కితే రు.17 కోట్ల షేర్ పెద్ద కష్టం కాదు. అయితే నాలుగు సినిమాల పోటీలో రిలీజ్ కావడమే కాస్త ఇబ్బంది. మరి సాయి ఏం చేస్తాడో ? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి