తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు , హీరోయిన్ రష్మీక మందన్న కలిసి నటిస్తున్న చిత్రం 'సరిలేరూ నీకెవ్వరూ'.. ఎఫ్ 2 సినిమా ఘన విజయం అందుకున్న తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మీక మందన్నా హిరోయిన్ గా నటిస్తున్నారు.. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కాబోతుంది.. కాగా ఈ చిత్రం హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు..
తాజాగా ఈ చిత్రం సెన్సార్ గడప తొక్కింది.. యు /ఏ సర్టిఫికెట్ ను అందుకుంది.. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుండి బయటకి వచ్చిన టీజర్లు పోస్టర్లు పాటలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. అందుకే ఈ చిత్రం హిట్ పక్కా అని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం నుండి వచ్చిన అన్ని సినిమాకు మంచి రెస్పాన్స్ ను అందించిన కూడా సినిమా ఎక్కడో భయం పట్టుకుంది.. సినిమా ఎంత బాగున్నా పోటీలో దిగే అవతలి వాళ్ళను బట్టి విజేత ఎవరనే నమ్మకం కూడా ఉంది..
వివరాల్లోకి వెళితే.. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ఎప్పుడెప్పుడా అన్నవిదంగా సిద్దంగా ఉంది.. మహేష్ గత చిత్రం మహర్షి సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. సినిమాలో లేడీ బాస్ విజయ శాంతి నటిస్తున్నారు.. రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్ లో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు..ఈ సినిమా ద్వారానే ఈమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందన్న విషయం తెలిసిందే..
ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ అజయ్ పాత్రలో నటిస్తున్నారు.. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగనుంది.. అందుకోసమే హైదరాబాద్ లోని ఎల్బీ స్తేయడియంలో ఈ ఈవెంట్ జరుగుతుంది.. ఈ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా టాలీవుడ్ కా బాప్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు..చిత్ర బృందం సందడితో హోరెత్తించారు.. అతి పెద్ద సినిమా, చిరంజీవి రాకా కారణంగా అభిమనులు రాకా కూడా ఈవెంట్ కు ఎక్కువగానే ఉంది.. మరి ఈవెంట్ రచ్చ మామూలుగా జరగ లేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి