తెలుగులో ప్రతినాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్య ప్రకాష్. అద్భుతమైన డైలాగ్ డెలివరీతో తనదైన స్టైల్ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎంతో మంది కొత్త విలన్స్ వస్తున్నప్పటికీ పోతున్నప్పటికీ సత్యప్రకాష్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి... తెలుగు ప్రేక్షకులను అలరించాడు సత్య ప్రకాష్. అప్పట్లో అన్ని సినిమాల్లో దర్శకులు అందరికీ ప్రతినాయకుడి పాత్రకు కేరాఫ్ అడ్రస్ సత్యప్రకాష్. స్టార్ హీరోలైన చిన్న హీరోలు అయినా ఆ సినిమాలో విలన్ గా సత్యప్రకాష్ ఉండాల్సిందేనని దర్శకులు భావించేవారు. 

 

 

 ఇక సత్యప్రకాష్ కూడా తనదైన నటనతో... డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో విలన్ పాత్రలో నటిస్తూ... విలన్ పాత్రలకు జీవం పోసేవాడు. ఓ వైపు కామెడీ విలన్ గా  చేస్తూనే మరో వైపు సీరియస్ విలన్ గా  కూడా ప్రేక్షకులను అలరించారు నటుడు సత్య ప్రకాష్. కమెడియన్ కూడా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అలరించాడు  నటుడు సత్యప్రకాష్. అయితే తాజాగా సత్యప్రకాష్ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాను దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాడినని  సత్యప్రకాష్ చెప్పుకొచ్చారు. తమది  ఉమ్మడి కుటుంబం అని కేవలం రెండు కథలు మాత్రమే ఉండేవని.. రెండు గదుల్లో 11 మందిమీ  ఉండేవాళ్ళం అంటూ సత్యప్రకాష్ తెలిపారు. 

 

 

 ఆ రోజుల్లో మా నాన్న ఒక్కరు మాత్రమే సంపాదిస్తూ ఉండేవారని మా నాన్న జీతం మీదే కుటుంబం మొత్తం పోషన జరిగేదని సత్యప్రకాష్ చెప్పుకొచ్చారు. మా నాన్న చేసే జీవితం కుటుంబ పోషణకు సరిపోకపోవడం వలన అప్పులు చేస్తూ ఉండేవారు అంటూ చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు అమ్మానాన్నలు అన్న మాకు పెట్టేసి వాళ్ళు బ్రెడ్ తినేవారని... అయితే మాకు బ్రెడ్ పెట్టకుండా వాళ్లే తినేస్తున్నారు  అనుకునే వాళ్ళం కానీ అది పేదరికం అని మాత్రం ఆ వయసులో మాకు తెలియలేదని సత్యప్రకాష్ చెప్పుకొచ్చారు. నాన్న సైకిల్ పై  తిరుగుతూ ఉండటం చూసి ఎప్పటికైనా స్కూటర్ కొనగలమా అని అనుకునేవాడిని... కానీ తాను కారు కొనే స్థాయికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. దీనంతటికీ భగవంతుని అనుగ్రహమే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను అంటూ సత్య ప్రకాష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: