బాలీవుడ్‌లో ఎఫైర్ల గోల ఎక్కువుగా ఉంటుంది. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఏ విధ‌మైన సంబంధం లేకుండానే ఎఫైర్ల చిక్కుల్లో ప‌డుతుంటారు. ఆ విధంగా ఓ బాలీవుడ్ న‌టుడుకి ఎఫైర్ ఉచ్చు మెడ‌కు చిక్కుకుంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ కూతురు ఆలియా భట్ తో అఫైర్ నడుపుతున్నారని వస్తున్న వార్తలను అర్జున్ ఖండించాడు. నాకు ఎవరితో కూడా ఎఫైర్లు కాని, లింకులు కాని లేవని బాలీవుడ్ నటుడు, బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ స్పష్టం చేశారు. 'ప్రస్తుతం నేను ఒంటరినే. నా దృష్టి అంతా కెరీర్ పైనే ఉంది. కెరీర్ లో ఉన్నత శిఖరానికి చేరుకోవడమే ఏకైక లక్ష్యం. ఆతర్వాతే నేను జీవిత భాగస్వామి కోసం ఆలోచిస్తాను' అని అర్జున్ తెలిపారు. ప్రస్తుతం తాను పెళ్లి, ప్రేమ గురించి ఆలోచించడం లేదు. నా జీవితంలో ఏ అమ్మాయి ప్రస్తుతం చోటు లేదు అని తెలిపారు. ఇదిలా ఏంటే అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయ‌టానికి శ్రద్ధాకపూర్ సిద్ధంగా ఉందిని బిటౌన్‌లో వినిపిస్తున్న ఓపెన్ టాక్‌. యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందించిన 'గూండే' చిత్రంలో రణ్ వీర్ సింగ్, ప్రియాంక చోప్రాతో కలిసి అర్జున్ నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. చేతన్ భగత్ నవల '2 స్టేట్స్: ది స్టోరి ఆఫ్ మై మ్యారేజ్' ఆధారంగా రూపొందుతున్న '2 స్టేట్స్' చిత్రంలో ఆలియా భట్ నటిస్తొంది. మొత్తానికి అర్జున్‌ క‌పూర్ టాపిక్‌తో బిటౌన్ బోణిక‌పూర్‌, శ్రేదేవిల‌ను టార్గెట్ చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: