దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. కొందరు సెలబ్రిటీలు ఇంటి పనులు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే.... మరికొందరు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల స్టార్ హీరోలకు, హీరోయిన్లకు ఇబ్బందులు లేకపోయినా చిన్నాచితకా వేషాలు వేసేవారికి మాత్రం సమస్యలు తప్పటం లేదు. 
 
లాక్ డౌన్ వల్ల టీవీ సీరియల్స్, రియాలిటీ షోస్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 40 రోజులుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ వల్ల బుల్లితెరపై సూపర్ హిట్టైన జబర్దస్త్ షో పార్టిసిపెంట్స్ లో ఒకరైన జీవన్ రైతు అవతారం ఎత్తాడు. తనకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో పనులు చేస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండకూడదని జీవన్ రైతు అవతారం ఎత్తినట్టు తెలుస్తోంది. 
 
జీవన్ పొలంలో వడ్లను తూర్పారా పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేజ్ షోలతో కెరీర్ ను ప్రారంభించిన జీవన్ కు జబర్దస్త్ షో ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర టీంలలో అవకాశం రావడంతో జీవన్ కమెడియన్ గా ప్రూవ్ చేసుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉన్న జీవన్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. జీవన్ పలు టీవీ ఛానెల్స్ లో యాంకర్ గా పని చేశాడు. 
 
లాక్ డౌన్ సమయంలో ప్రముఖ నటులు సైతం ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఫామ్ హౌస్ లో భార్యా పిలలతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. మామిడి కాయల మధ్యలో తన కొడుకు కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసి మా వాడు మామిడికాయల వ్యాపారి అయ్యాడంటూ కామెంట్లు పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: