తెలుగు, తమిళ్లో నటిస్తూ మంచి క్రేజ్ ను అందుకున్న ముద్దుగుమ్మ అంటే గుర్తొచ్చేది నయనతార.. చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో నయన్ ముందు వరుసలో వుంటుంది.. సినిమాలకు డిమాండ్ ఎక్కువే సినిమాలు ఎక్కువనే చెప్పాలి.. మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్న నయన్ వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.. అయితే నయన్ తన అసిస్టెంట్స్ సాలరిని ఓ నిర్మాత బయట పెట్టాడు.. వివరాల్లోకి వెళితే..

 

 

 

రజినీకాంత్, కమల్ హాసన్‌లకున్న హోదా నయనతారకు కూడా ఉంది. అయితే నయనతార కోసం సెట్స్‌లో పెట్టే ఖర్చులు అంతా ఇంతా కాదు అంటూ ప్రముఖ తమిళ నిర్మాత రాజన్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. నయనతార ఏదన్నా సెట్‌కు వెళితే ఆమెతో పాటు ఏడుగురు అసిస్టెంట్స్ కూడా ఉండి తీరాల్సిందేనట.

 

 

 

 

నయనతార సినిమాలు అంటే ఆల్మోస్ట్ అన్నీ హిట్ సినిమాలే..ఎన్నో ఓరియెంటెడ్ సినిమాలలో నటించిన ఘనత నయన తారదే.. మరొక విషమేంటంటే ఆమెతో పాటుగా ఆరుగురు అసిస్టెంట్స్ కూడా ఉంటారు. వారందరికీ రోజుకు ఏడు నుంచి పన్నెండు వేల వరకు జీతాలు ఇవ్వాలి. నాకు తెలిసిన వారు ఈ విషయాలు చెప్పారు. కాబట్టి వారు చెప్పేది నిజమే అయివుంటుంది. ఈ రకంగా చూసుకుంటే నయన్ అసిస్టెంట్స్‌కు రోజుకు 75 నుంచి 80 వేల రూపాయల వరకు ఇవ్వాలి. 

 

 

 

 

 

ఒకవేళ నయన్ 50 రోజుల పాటు సెట్స్‌కు వస్తే పరిస్థితేంటో ఆలోచించండి. నయన తార సినిమాలలో బ్లాక్ బాస్టర్ సినిమా అంటే గుర్తొచ్చేది రాజా రాణి, సైర, చంద్రముఖి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు లైన్ లోకి వస్తాయి.. అందుకే నయనతార సినిమాలకు డిమాండ్ కూడా మార్కెట్ లో ఎక్కువే..  అంతేకాదు ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: