తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పుడు నడిచిపోతూ ఉంటాయి. ఇలా నిలిచిపోయిన సన్నివేశాలలు  ఎన్నో ఏళ్ళు గడిచినప్పటికీ... అదే కిక్ ఇస్తూ ఉంటాయి. ఇలా ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ఎన్నో సన్నివేశాలు ప్రేక్షకులకు ఫేవరేట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ప్రభాస్ యుద్ధం చేస్తున్న సమయంలో ఆ ఒక్క సన్నివేశం మాత్రం ప్రేక్షకులను ఇప్పటికి కూడా కళ్ళార్పకుండా చూసేలా చేస్తుంది. 

 


 ఇంతకీ అసలు ఆ సన్నివేశం  ఏమిటంటే... ప్రభాస్ రానా ఇద్దరు కలిసి కాలకేయుడు తో యుద్ధం చేస్తున్న సమయంలో... కొన్ని యుద్ధ ఆయుధాలను రానాకి ఇంకొన్ని యుద్ధ ఆయుధాలను ప్రభాస్ కి ఇస్తారు. ఈ నేపథ్యంలోనే బాణాలు ఉన్న అన్నింటినీ రానాకి ఇవ్వగా... వాటితో కాలకేయుడు సైన్యాన్ని రానా సమర్థవంతంగా చంపుతూ ఉంటాడు. ఇదే సమయంలో బాహుబలి గా ఉన్న ప్రభాస్ ఎంతో తెలివిగా ఆలోచిస్తాడు. ఒక గుడారాలపై వేసుకునే వస్త్రానికి  మండే పదార్థాన్ని పూసి.... వాటి ద్వారా కాలకేయుని సైన్యాన్ని మొత్తం కాల్చేస్తూ ఉంటాడు బాహుబలి పాత్రలో ఉన్న ప్రభాస్. ఈ ఒక్క సన్నివేశం తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. 

 


 ఈ సన్నివేశం ఎన్నిసార్లు చూసినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం మొదటిసారి చూసిన ఫీలింగ్ వస్తుంది. ఈ సన్నివేశంలో బాహుబలి ఊహకందని విధంగా సరి కొత్తగా ఆలోచించి  సైన్యాన్ని హతమారుస్తూ ఉంటాడు. అంతేకాకుండా... బాహుబలి యుద్ధం చేస్తున్న సమయంలో... నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అంటూ ఉండే ఒక సన్నివేశం కూడా తెలుగు ప్రేక్షకులకు మైమరిపింప  చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా బాహుబలి సినిమాలో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: