ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ ను పక్కా ప్లాన్ ప్రకారమే ఆత్మ హత్య చేశారు అన్న ఆరోపణలు కూడా ప్రస్తుతం తెరమీదకు వస్తున్నాయి. అటు పోలీసులు కూడా ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నప్పటికీ తర్వాత ఆత్మహత్య తెల్చేశారు, సుశాంత్ ఆత్మహత్యపై ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు... సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సుశాంత్ తండ్రి కూడా సుశాంత్ ని అతని ప్రియురాలే చంపేసింది అంటు సరికొత్త వాదనను తెరమీదకు తేవటం సంచలనంగా మారిపోయింది.
ఇక తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేతా సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి లేఖ రాశారు. తాను సుశాంత్ సోదరిని అంటూ లేఖలో పేర్కొన్న శ్వేత... తమకు ఈ దేశ న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని... మా తమ్ముడు మృతి పై లోతైన దర్యాప్తు చేపట్టాలని అంటూ శ్వేత ప్రధానమంత్రి లేఖలో కోరారు. మేము ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చామని... మాకు ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లాంటి వారు ఎవరు లేరు అంటూ చెప్పుకొచ్చారు. అందుకే మా తమ్ముడి ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలను పరిశీలించి.. సరైన న్యాయం చేయాలి అంటూ అభ్యర్థిస్తూన్నాను అంటూ ప్రధానమంత్రికి లేఖలో కోరారు సుశాంత్ సోదరి. అయితే గతంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి లేఖ రాసిన విషయం తెలిసిందే.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి