ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు కొన్ని న్యూస్ ఛానెళ్లకోసం ప్రత్యేక చర్చలు, ఎన్నికల సమయంలో టాక్ షోలు నడిపించారు ఝాన్సీ. ఆ అనుభవంతోటే ఆమె పలు సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్పందిస్తుంటారు. తాజాగా లాక్ డౌన్ టైమ్ లో సినిమా, సీరియళ్ల షూటింగ్ లకు అనుకోకుండా బ్రేక్ పడింది. టీవీ కార్యక్రమాలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. ఓటీటీ పూర్తిగా డామినేట్ చేసే పరిస్థితి. ఈ దశలో ఓటీటీలకోసం ఝాన్సీ ఈ కొత్త ప్రాజెక్ట్ తలపెట్టినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఓటీటీలలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేక్షకుల్ని తమవైపు ఆకర్షించాలంటే, సబ్ స్క్రిప్షన్స్ పెంచుకోవాలంటే ముందు అడల్ట్ కంటెంట్ తోనే ఎరవేయాలని చూస్తున్నారు నిర్వాహకులు. అదే దారిలో 'పెద్దలకు మాత్రమే' అనే టైటిల్ తో ఝాన్సీ తెరపైకి రాబోతున్నారు. అయితే టైటిల్ చూసి ఎవరూ మోసపోవద్దని, ఇది పెద్దలు మాత్రమే చూసే కార్యక్రమం కాదని, పెద్దలతోపాటు అందరూ ఈ ప్రోగ్రామ్ చూడొచ్చని, అదే సమయంలో పెద్దలకు ఉపయోగపడేలా, మిగతా జీవితాన్ని సరిదిద్దుకునేలా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఝాన్సీ. అలీ టాక్ షోలో ఝాన్సీ ఈ విశేషాలన్నీ వివరించారు. ఝాన్సీ 'పెద్దలకు మాత్రమే' ఎలా ఉంటుందనే విషయం తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి