భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి క్యాస్టింగ్ కౌచ్ అనే  వివాదం  సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సెలబ్రెటీలు క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటికి చెబుతూ సంచలనం సృష్టించారు. బాలీవుడ్ లో  మహా మహా సెలబ్రిటీలు సైతం తమ కెరియర్  లో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెట్టి ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే, ఇక బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని... టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ఏ రేంజ్ లో ఉద్యమం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్ కి గురై ఆ తర్వాత అవకాశాలు లేక రోడ్డున  పడుతున్నారు అంటూ శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు... ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి . కేవలం శ్రీరెడ్డి మాత్రమే కాకుండా మాధవి లాంటి ఎంతో మంది నటీమణులు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పిన విషయం తెలిసిందే.



 అయితే సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని కొంతమంది సంచలన వ్యాఖ్యలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి . ఇక తాజాగా ఓ వైపు నటిగా మరోవైపు యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ లో దూసుకుపోతున్న అనసూయ భరద్వాజ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన  వరకైతే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు అని చెప్పుకొచ్చింది అనసూయ భరద్వాజ్. అయితే ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి మీ టూ,  క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఉన్నప్పటికీ కూడా అవి కేవలం అమ్మాయి మనస్తత్వం పైనే ఆధారపడి ఉంటాయని... అవకాశం ఇస్తాను నా అవసరం తీరుస్తావా అని అన్నప్పుడు ఆ విషయంలో అమ్మాయి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.



 అమ్మాయి ఇష్టం లేకుండానే ఎక్కడ ఏం జరగదు అంటూ వ్యాఖ్యానించిన  అనసూయ... ఈ అవకాశం కాకపోతే మరొకటి... మనపై మనకు నమ్మకం వచ్చినప్పుడు... అవకాశాల కోసం అడ్డదారులు తొక్కి వలసిన అవసరం ఉండదూ అంటూ తెలిపింది. అయితే తన కెరీర్ మొదటి నుంచి తన టాలెంట్ పైనే  తాను నమ్మకం ఉంచానని తెలిపిన అనసూయ.. అవకాశాల కోసం తన క్యారెక్టర్ ని  ఎక్కడ వదులుకోవడానికి సిద్ధపడ లేదు అంటూ తెలిపింది. ఏ అవకాశం వచ్చినా అందులో నేను తప్ప మరొకరు చేస్తే బాగుండదు అనేంతలా అందరినీ ప్రభావితం చేసేందుకు కష్టపడుతూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ,

మరింత సమాచారం తెలుసుకోండి: