తనకు బాలీవుడ్ లో నెపోటిజం ఉందా లేదా అన్న విషయం తెలియదు కానీ మన టాలీవుడ్ విషయానికి వస్తే మాత్రం అలాంటివి పెద్దగా లేవు అని తెలిపాడు. తన కెరీర్ బిగినింగ్ నుంచి అంతా తనకు సహకారం అందించి ప్రోత్సహించారని తెలిపిన నాని.. ఎక్కడైనా ఫంక్షన్స్ లో కలిసినప్పుడు కూడా తనను పలకరించిన విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ నాని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరూ ఎప్పుడు కొత్త టాలెంట్ ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు నాని.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కిడ్స్ అంటూ పేరొందిన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రానా లాంటి వారు సైతం తనని ఎంతో ప్రేమగా పలకరించే వారిని... తన సినిమా పై వారి అభిప్రాయాలను కూడా తనతో పంచుకునేవారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే స్టార్ కిడ్స్ కి ఒక్క అడ్వాంటేజ్ ఉంటుందని... బ్యాక్గ్రౌండ్ కారణంగా వారికి ఒక్క సినిమాతో వచ్చే క్రేజ్... కొత్త వాళ్లకి నాలుగైదు సినిమాల తో వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు నాని. స్టార్ కిడ్స్ అయినప్పటికీ వారు ఎలాంటి ఆధిపత్యం చూపించకుండా సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారని.. అయినా వారిని స్టార్ కిడ్స్ అని అంటుంటారు అని చెప్పుకొచ్చారు నాని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి