మొన్న దిశా ఘటన మరవక ముందే మళ్ళీ ఇప్పుడు ఇంకో ఘోరం జరిగిపోయింది.ఇంకా దేశంలో ఇలాంటి దారుణమైన అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగి నిందితులకు తగిన శిక్ష పడిన కాని ఇంకా అలాంటి మృగాళ్లు వస్తూనే వున్నారు. ఈ అఘాయిత్యాలు చేస్తూనే వున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఈ నెల 14న సామూహిక అత్యాచారానికి గురైన యువతి సోమవారం మరణించింది. హత్యాచార కాండకు పాల్పడిన నలుగురు దోషులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటనను రిపోర్ట్ చేసే విషయంలో స్టయిల్ చేంజ్ చేయాలని ఝాన్సీ డిమాండ్ చేస్తున్నారు. “మహిళలపై లైంగిక దాడి, వేధింపులకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడు బాధితులను కాకుండా దోషులను హైలైట్ చెయ్యండి.వార్తను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధానాన్ని మార్చండి” అని ఝాన్సీ పేర్కొన్నారు.
దోషులను అరెస్టు చేశారా? ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? బాధితురాలికి నైతిక చట్టపరమైన మద్దతు ఉందా? దోషులకు శిక్ష పడితే… ఏ విధమైన శిక్ష పడుతుంది? ఈ విధంగా సరైన ప్రశ్నలు అడగాలని ఝాన్సీ కోరారు. బాధితురాలి ఫోటోలను ప్రచురించవద్దని, టీవీల ప్రసారం చేయవద్దని ఝాన్సీ పేర్కొన్నారు. కేసును సెన్సేషనల్ చెయ్యకుండా… వివరాలను మాత్రమే ప్రజలకు అందించాలన్నారు.
“ఇటువంటి కేసులలో కులాన్ని ఎందుకు తీసుకొస్తారు? కులాలకు అతీతంగా దోషులను శిక్షించాలి” అని నెటిజన్ ఒక కామెంట్ చేయగా… “మనం అర్థం చేసుకున్న దాని కంటే కుల రాజకీయాలు లోతైనవి” అని ఝాన్సీ రిప్లై ఇచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి