ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల సినిమాలతో గొప్ప విజయాలు అందుకున్న రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని దేశవిదేశాల్లో మారుమ్రోగేలా చేశారు. ఇక నేడు తన బర్త్ డే జరుపుకున్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పేట్రియాటిక్ డ్రామా నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులతో భారీ యాక్షన్ అంశాలతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది దీని. తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్న రాజమౌళి, దాని తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గతంలో తీసిన మగధీర సినిమాకు సీక్వెల్ అయిన మగధీర 2 తెరకెక్కించనున్నాడని అంటున్నారు.
ఇప్పటికే ఆ సినిమా సీక్వెల్ కథ విషయమై తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరిపిన రాజమౌళి అతి త్వరలో ఆ సినిమా కథ పూర్తయిన అనంతరం దానిని రామ్ చరణ్ కు వినిపించి సినిమాని పట్టాలెక్కించేలా ప్రణాళికలు కూడా ఇప్పటినుండే సిద్ధం చేస్తున్నారని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు ఉందో తెలియదు గాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం ఇది నిజంగా మెగాఫ్యాన్స్ కు పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి