రామ్ గోపాల్ వర్మ పేరు అంటే చాలా మందికి నచ్చదు.. ఎందుకంటే ఆయన మంచి కన్నా కూడా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు.. తెలుగు ఇండస్ట్రీలో చాలా మందికి ఆయన అంటే పడదు. అయిందానికి , కానీ దానికి ఏదోక విధంగా వర్మ నోరు పారేసుకుంటాడు. సినిమాలను కూడా అంతకు మించి రచ్చకు తెర తీసెలాగా తెరకెక్కించడం ఆయనకు సరదా. రాజకీయ రచ్చలకు దారి తీసే విధంగా సినిమాలను తీయడం వాటి ద్వారా అందరిపైనా కక్ష్య తీర్చుకోవడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తాడు. అందుకే వర్మకు వివాదాస్పద దర్శకుడు అని పేరు పెట్టారు.



లాక్ డౌన్ కొనసాగుతుననప్పటికీ వర్మ సైలెంట్ అవ్వలేదు.. సినిమాలను తీస్తూ , సొంత ఓటీటీ లో విడుదల చేస్తూ బాగానే సంపాదించాడు.లెస్బియన్ లవ్ స్టోరీ ‘డేంజరస్’. ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ సినిమాలతో ఓ రేంజ్ రొమాన్స్‌ని ప్రేక్షకుల ముందుంచిన ఆయన, ఈ సారి ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీని కెమెరాలో బందిస్తూ మరో అడల్ట్ కిక్కివ్వబోతున్నారు. ఓవర్ డోస్‌ రొమాన్స్‌తో మత్తెక్కించడానికి రెడీ అవుతున్నారు.  దాదాపు ఆ సినిమాలు చిత్రీకరణను పూర్తి చేసుకున్నాయి.



ప్రస్తుతం ఈ చిత్రాలు గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే..ఇందుకోసం చాలా రోజులుగా హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సర రాణిలతో అక్కడే ఉంటున్న ఆర్జీవీ.. తాజాగా ఆ హీరోయిన్లతో చిల్ అవుతున్న పిక్స్ షేర్ చేస్తూ ఓపెన్ అయ్యారు. గోవాలో కర్లీస్ అనే అందమైన ప్రదేశం ఉంది.. ఆ ప్రాంతంలోనే డేంజరస్ సినిమా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నైనా గంగూలీ, అప్సర రాణిలతో నైట్ పార్టీలో తాను దిగిన ఫోటోలు షేర్ చేశారు వర్మ..  ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మనోడు మాంచి రసికుడే అంటూ కామెంట్లతో రచ్చ లేపుతున్నారు. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే రచ్చ చేసిన సంగతి తెలిసిందే. వర్మసినిమా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: