కరోనా వైరస్ కారణంగా పూర్తిగా షూటింగులు మొత్తం నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండే  స్టార్ హీరోలందరూ కరోనా  వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో సినిమాలు మళ్లీ పట్టాలపైకి ఎక్కి  షూటింగ్ మొదలు పెట్టుకుంటూన్న విషయం తెలిసిందే. దాదాపుగా అందరి హీరోల సినిమాలు షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి  దృశ్య షూటింగ్ ప్రారంభించినప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించాలి అంటూ అటు కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు సినిమా షూటింగు సమయంలో కరోనా నిబంధనలు పాటించడం లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ఇటీవలే ఏకంగా  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై  పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం గమనార్హం. ఇటీవలే అమీర్ ఖాన్ తన కొత్త సినిమా షూటింగుకు సంబంధించి చిత్రీకరణలో పాల్గొన్న విషయం తెలిసిందే. షూటింగ్ లో పాల్గొన్న సమయంలో అమీర్ ఖాన్ ఎలాంటి కరోనా నిబంధనలు పాటించలేదు అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై  మరోసారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.



 బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కరోనా నిబంధనలను ఉల్లంఘించారని.. ఎపిడెమిక్  యాక్ట్  నిబంధనలను బ్రేక్ చేశారు అని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్లోని ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ అమీర్ ఖాన్ పై  పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. ఇటీవలే షూటింగ్ కోసం వచ్చిన అమీర్ ఖాన్ కనీసం కరోనా నిబంధనలు పాటించకుండా అభిమానులతో ఫోటోలు దిగడం లాంటివి చేశారని.. అంతేకాకుండా ఎక్కడ భౌతిక దూరం కూడా పాటించలేదు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన. కాగా అమీర్ ఖాన్ పై ఎమ్మెల్యే కేసు నమోదు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: