గతంలో ఒక వివాదాస్పద అంశాన్ని అదేవిధంగా బూతు కంటెంట్ ను  సినిమాగా తీయడానికి నిర్మాతలు భయపడేవారు. దీనికికారణం  సెన్సార్ నియమనిబంధనలు. సినిమాలలో అశ్లీలత మరీ ఎక్కువగా ఉంటే సెన్సార్ బోర్డు సభ్యులు అటువంటి దృశ్యాలను తొలగించేవారు.  అందువల్ల నిర్మాతలు దర్శకులు కూడ రొమాన్స్ శాతం మరీ శృతి మించకుండా జాగ్రత్తలు తీసుకునేవారు.


అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది మారిన పరిస్థితులలో యూట్యూబ్ ఓటీటీ ఛానల్స్ లో సినిమాలు ప్రదర్శించే స్థాయికి నిర్మాతలు చేరిపోయారు. దీనికితోడు కరోనా పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా మూత పడటంతో సినిమాల విడుదలకు ఓటీటీ లను ఆశ్రయించ వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికితోడు ఓటీటీ లలో ప్రసారం చేసే  షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సీరిస్ ల ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతులు అవసరం లేకపోవడంతో అశ్లీల కంటెంట్ అనేక సినిమాలు ఇళ్ళలోకి వచ్చి పడిపోతున్నాయి.


దీనితో ఇలాంటి కంటెంట్ కు అలవాటు పడిపోయిన యూత్ మంచి సినిమాలు తీసినాచూడటం మానివేశారు. ఇలాంటి పరిస్థితులలో సినిమాలు తీయడం కష్టసాధ్యమైన పనిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఫిలిం ఇండస్ట్రీని రక్షించడానికి డిజిటల్ మీడియా వెబ్ పోర్టల్స్ లో పెరిగిపోతున్న అశ్లీలతను కట్టడి చేసేందుకు కేంద్రం ప్రభుత్యం తీసుకున్న నిర్ణయం ఏమేరకు ఫిలిం ఇండస్ట్రీకి సహాయపడుతుంది అన్న అంశం పై చర్చలు జరుగుతున్నాయి.


ప్రస్తుత నిర్ణయం ప్రకారం కొత్తగా ఎవరైనా ఆన్లైన్ ఛానల్స్ ప్రారంభించాలంటే అనుమతి తీసుకోవాలి. అంతేకాదు యూట్యూబ్ ఛానల్స్ ఓటీటీ కంటెంట్లను సమాచార శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. ఓటీటీ లలో ప్రసారం అవుతున్న శృతిమించిన  అశ్లీలత కంటెంట్ ను ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం కట్టడి చేస్తుందని భావించిన ఎంతవరకు సమర్ధంవంతంగా ఈచట్టం అమలుచేయగలరు అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.


ప్రతిరోజు కొన్నివేల సంఖ్యలో షార్ట్ ఫిలిమ్స్ కొన్ని వందల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్న పరిస్థితులలో వీటి కంటెంట్ ను పూర్తిగా స్క్రీన్ చేసి ఫిల్టర్ చేసే వ్యవస్థను అంతసులువుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలవా అన్నసందేహాలు తలెత్తుతున్నాయి. పోర్న్ వీడియోలను ప్రభుత్వం నిషేదించినా ఇంకా జనంకు అందుబాటులోనే ఉన్న పరిస్థితులలో లేటెస్ట్ గా ప్రభుత్వం ఓటీటీ బూతు కంటెంట్ పై తీసుకున్న నిర్ణయాన్ని ఎంతవరకు సమర్థవంతంగా అమలు చేయగలదు అన్నసందేహంతో పాటు అదే జరిగితే మళ్ళీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చుని చూసే వెబ్ సిరీస్ లు సినిమాలు చూసే అవకాశం త్వరలోనే రానున్నది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: