సెహరి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బాలకృష్ణ కలిసి చదువుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మేనల్లుడు జిష్ణు రెడ్డి ఆహ్వానం మేరకు ఈ వేడుకకు హాజరయ్యారు బాలకృష్ణ. హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లు. ఛీఫ్ గెస్ట్ బాలకృష్ణ ప్రసంగం కామెడీగా.. ఆరోగ్య సూత్రాలతో సాగింది. కరోనాకు వ్యాక్సిన్ రాదని.. ఇప్పట్లో పోయేది కాదని.. సహజీవనం చేయాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమా విషయానికొస్తే.. వర్గో పిక్చర్స్ బేనర్‌లో సినిమా రూపొందుతుంటే.. బేనర్ పేరు వర్జిన్ పెడితో బాగుండేదనడంతో..నవ్వులు పూశాయి.
తొలి కార్తీక సోమవారంనాడు బాలయ్య యమా యాక్టీవ్‌గా కనిపించాడు. మైకు పట్టుకుని.. అన్నింటినీ కవర్ చేసేశాడు. హర్ష్.. క్రష్.. బుష్ అంటూ. ఆయన ప్రసంగం ప్రాసతో సాగింది. ఈ జనరేషన్ హీరోయిన్స్‌తో ఆడిపాడడానికి రెడీ అంటున్నాడు బాలయ్య. సెహరి హీరోయిన్ పేరు సిమ్రాన్ కావడంతో.. నరసింహనాయుడులో తన ఆడిపాడిన సిమ్రాన్‌ను గుర్తుచేసుకున్న బాలకృష్ణ ఈ అమ్మడితో కలిసి నటిద్దామన్నాడు.
బాలకృష్ణ తనదైన స్టైల్లో సుదీర్ఘ ప్రసంగం చేసినా.. ఈసారి కాస్త కామెడీ టచ్ ఇచ్చాడు. మనసులోని మాటలు బైటపెట్టేశాడు. సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని.. అయితే కొందరు కొబ్బరికాయ కొట్టి ఫ్లాప్ అవ్వాలని కోరుకునే వాళ్లున్నారు బాలయ్య. మొత్తానికి నందమూరి నట సింహం బాలయ్య చేసిన కామెడీకి అక్కడున్న వారి పొట్టలు చెక్కలయ్యాయి. అంటే ఆయన అంతగా నవ్వులు పూయించాడు.సాధారణంగా బాలయ్య మైక్ పడితే చాలు.. రకరకాల డైలాగ్ లు వేసి ప్రేక్షకులను మైమరిపింపజేస్తాడు. తనలో ఉన్న టాలెంట్ నంతా వాళ్ల ముందు ఒలకబోస్తాడు. స్వచ్ఛమైన తెలుగు పదజాలంతో.. డైలాగులతో ఇట్టే ఆకట్టుకుంటాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి