ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సీనియర్ నటుడు విజయ గంగరాజు గుర్తున్నాడా..యజ్ఞం, సీమ టపాకాయ్, సుడిగాడు వంటి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. నందమూరి నట సింహం బాలకృష్ణ, రోజా కాంబినేషన్లో సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన "భైరవద్వీపం" సినిమాలో  భైరవుడిగా నటించి అందరినీ మెప్పించారు విజ‌య రంగ‌రాజు.చూడ్డానికి భయంకరమైన విలన్ గా కనిపిస్తాడు ఆయన. అయితే ఆ సినిమాతో పేరు వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత గోపీచంద్ ‘య‌జ్ఞం’లో నాయుడమ్మగా మెప్పించిన తర్వాతే ఆయనకు కాస్తోకూస్తో అవకాశాలు పెరిగాయి.తరువాత చాలా చిన్న సినిమాల్లో నటించాడు కాని సరైన గుర్తింపు పొందలేదు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆయనకు సరైన పాత్ర పడితే చాటు చెలరేగిపోతారు. అయితే ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో ఆయన యూట్యూబ్ ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.ఈ సందర్భంగా కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజ‌య రంగ‌రాజు.



విష్ణువర్ధన్‌కు బాగా పొగరెక్కువని, లేడీస్ వీక్‌నెస్‌ కూడా ఉందని తెలిపారు. హీరోయిన్లు తన ఎదుటే మరెవరితోనైనా ఆయన సహించలేకపోయేవారని షాకింగ్ విషయం చెప్పారు. ‘ఓ సారి విష్ణువర్ణన్‌ సినిమాలో జయమాలిని నటిస్తోందని తెలిసి లొకేషన్‌కు వెళ్లాను. ఇద్దరికీ చనువు ఉండటంతో ఆమె నన్ను వెనుక నుంచి వాటేసుకుంది. మమ్మల్ని దూరం నుంచి చూసిన విష్ణువర్థన్ అసూయతో మా ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు’ అని తెలిపారు. తనకు పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నప్పుడు ఓ మధ్యవర్తి ద్వారా జయమాలిని సంబంధం వచ్చిందని విజయ్ రంగరాజు తెలిపారు. కొన్ని కారణాల వల్ల సంబంధం కుదరలేదని, అయినప్పటికీ ఎక్కడ కలిసినా జయమాలిన తనతో ఆప్యాయంగా మాట్లాడేవారని వెల్లడించారు.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: