'ఖైదీ' దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో హీరో విజయ్ నటించిన సినిమా ‘మాస్టర్’. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కొంతమంది సినిమా థియేటర్ యజమాన్లు హాళ్లను ఓపెన్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. సినిమా థియేటర్లు  థియేటర్లు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా.. సినిమాను ఎప్పుడెప్పుడు హాళ్లల్లో రిలీజ్ చేద్దామా.. అని మాస్టర్ం సినిమా యూనిట్ ఆలోచనలు చేస్తుండగా, ఈ సినిమాపై కొన్ని అవాస్తవలు ప్రచారం అవుతున్నాయి.

ఇళయదలపతి విజయ్ నటిస్తోన్న మాస్టర్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అదంతా అవాస్తవమని సినిమా యూనిట్ తెలిపింది. కానీ మరోసారి దీనిపై రూమర్లు ప్రచారమవుతున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ గురించి పూర్తి స్పష్టతనిచ్చేందుకు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ట్విట్టర్‌లో ఓ లెటర్‌ను పోస్టు పెట్టారు.

‘‘మనమందరం కరోనాతో ఇంకా పోరాడుతునే ఉన్నాం. మీరందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాము. మీలాగే మేము కూడా సినిమా కోసం వేచి చూస్తున్నాం. మీ పరిస్థితిని అర్థం చేసుకుంటాం. మీతోపాటే మేము కూడా మన అభిమాన హీరో ‘మాస్టర్’ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. ఈ మధ్య కాలంలో సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. అవన్నీ అవాస్తవమని చెప్పాం. కానీ మరోసారి మాస్టర్ సినిమా ఓటీటీలో వస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఓటీటీ వాళ్లు మమ్మల్ని సంప్రదించినా మేము వాటిని తిరస్కరించాము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ కష్టకాలంలో ఇండస్ట్రీ తిరిగి నిలబడాలంటే సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయ్యాలి. అది చాలా అవసరం. తమిళ ఫిల్మ్‌ ఇండస్ట్రీ మళ్లీ నిలదొక్కుకోవాలంటే, థియేటర్స్‌ ఓనర్స్‌ కూడా మాకు సపోర్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. త్వరలోనే ఓ మంచి న్యూస్‌తో ముందుకు తీసుకువస్తాం. అందరూ క్షేమంగా ఉండండి’’ అని దర్శకుడు లెటర్‌ను పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాపై వస్తోన్న ప్రచారాలకు తెర పడినట్టే అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: