మరీ ట్రోల్, ట్రెండింగ్ అంతగా ఎందుకు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలింగా చెబుతున్న పుష్పపై...రూమర్స్ రౌండ్లు కొడుతూనే ఉన్నాయి. ఆఫ్టర్ లాక్ డౌన్ షూట్ మొదలైన దగ్గరనుంచి షూట్ స్పాట్ లో ఒకటి జరిగితే మరొకటి జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే పలు "ఆన్ లొకేషన్" లీకులు యూనిట్ నే కాదు అటు అభిమానులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో సుకుమార్ అండ్ కో మరింత ప్రైవసీతో పుష్పను షూట్ చేస్తున్నారు.
అప్పట్లో నేరేడుమిల్లి ఫారెస్ట్ లో యాక్షన్ పార్ట్ తీశారు.ఆ తర్వాత అక్కడి పరిస్థితులు సహకరించకపోవడంతో హైదరాబాద్ చుట్టుపక్కల వంద ఎకరాలలో ఫారెస్ట్ సెట్ వేస్తున్నారు అని చెప్పారు. ఆతర్వాత అవేమి కాదని కన్ఫామ్ అయింది. ఇప్పుడు తాజా పాట చిత్రీకరణ జరుపుకుంటుందనే టాక్ రన్ అవుతుంది. అలాంటిదేం లేదని యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయినా రూమర్స్ ఆగకపోవడంతో యూనిట్ చేతులు పైకెత్తేసింది.
నిజానికి పుష్ప యూనిట్ వికారాబాద్ అడవుల్లో షూట్ జరుపుతుంది.నేరేడుమిల్లిలో మొదలైన కొద్దిపాటి యాక్షన్ పార్ట్ ను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఈ యాక్షన్ పార్ట్ అయ్యాకనే సాంగ్స్ షూట్ ఉంటుందని తెలుస్తుంది. అప్పటివరకు ఇది కాకుండా వేరేగా వచ్చే ఏ వార్తనైనా సరే యూనిట్ రూమర్ గానే చూడమంటుంది . ఇక పుష్ప ఇంతలా నెట్టింట్లో ట్రోల్ కావడం వెనుక అప్పోజిషన్ హీరోల ఫ్యాన్స్ తో పాటు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనే విషయం అర్ధమవుతుంది.
మొత్తానికి పుష్ప సినిమాపై రకరకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి