ఇక పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు అదే జోష్ తో దూసుకుపోతోంది. వరుస సినిమాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తూనే ఉంది ప్రియాంక చోప్రా. అయితే అప్పట్లో ప్రియాంక చోప్రా వివాహం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే 38 ఏళ్ల వయస్సు ఉన్న ప్రియాంక చోప్రా తన కంటే పది సంవత్సరాల వయస్సు చిన్నవాడైన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. దీంతో వీరిద్దరి పెళ్లి గురించే అందరూ చర్చించుకున్నారు. ఇకపోతే ఇద్దరూ ప్రస్తుతం ఎక్కడ కనిపించినా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. ఇటీవలే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పుకొచ్చింది. తనకు ఏకంగా పదకొండు మంది పిల్లలను కనాలి అనే కోరిక ఉంది అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. మీరు ఎంతమంది పిల్లలు కావాలి అనుకుంటున్నారు అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న అడగగా.. ఆసక్తికర సమాచారం చెప్పుకొచ్చింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. తన భర్త నిక్ జోనస్ తో కలిసి వీలైతే 11 మంది పిల్లలను కనాలని ఉంది.. ఒక క్రికెట్ టీం కావచ్చు అంటూ ప్రియాంక చోప్రా తన మనసులో మాట చెప్పేసింది. వీలైనంత మంది ఎక్కువ మంది పిల్లలను కంటాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా చెప్పిన సమాధానంతో అందరూ షాక్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి