అవి హిట్ అయితే పవన్ సొంత ప్రొడక్షన్ లోనే వెంటనే మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తేవాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే.. త్వరలోనే పవన్ కళ్యాణ్ మరో యువ హీరోతో సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు ఆయన సొంత మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తోనే సినిమాను నిర్మించే ఆలోచనలో వున్నాడట.పవన్ తో ఇదివరకు గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను డైరెక్ట్ చేసిన బాబీ (కిషోర్ కుమార్ పార్థసాని) ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం.
వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేశాడు. మొదట సినిమా ఉప్పెన ఇంకా రిలీజ్ కాలేదు. ఇక క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను పూర్తి చేశాడు. మరి ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఎప్పుడు సినిమా నిర్మిస్తాడో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి