ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ‘చిన్నారి పెళ్లి కూతురు’ అలాగే ‘ఉయ్యాలా జంపాల’ హీరోయిన్ అయిన అవికా గోర్ తాజాగా బికినీలో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే బికినీలో.. ఫారెస్ట్ లో స్విమ్మింగ్ ఫూల్ మధ్య పడుకుని యమ హాట్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో యూత్ ని హీటెక్కిస్తూ తెగ వైరల్ అవుతున్నాయి . ఈ ఫోటోలు చూసినవారంతా ‘ఈమె నిజంగా చిన్నారి పెళ్లి కూతురేనా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తెగ మండి పడుతున్నారు. పద్దతిగా వుండే చిన్నారి పెళ్లి కూతురు ఇలా మారడం ఏంటని కోప్పడుతున్నారు.

మరికొంతమంది నెటిజన్లు అయితే ‘అవికాలో ఇంత హాట్ యాంగిల్ ఉందా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అవికా తన ప్రియుడితో కలిసి హాలీవుడ్ ట్రిప్ కు వెళ్ళిందట. మిలింద్‌ చద్వానీ అనే సామాజిక కార్యకర్తతో అవికా గత కొంతకాలం నుండీ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అతనితో డీప్ రొమాంటిక్ మూడ్ మెయింటైన్ చేస్తున్న టైంలో తీసిన ఫోటోని కూడా షేర్ చేసింది అవికా. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా?’ సినిమాల టైములో బాగా లావైపోయిన అవికా..ఇప్పుడు ఈ విధమైన బికినీ బాడీ ఫిట్ నెస్ మెయింటైన్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది..ఎన్నో వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యింది. తాను లావైన టైములో నెటిజన్లు చేసిన ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకునే.. అలా స్లిమ్ అయినట్టు చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో అవికా ‘రాజు గారి గది3’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం కమర్షియల్ సక్సెస్ ను అయితే అందుకుంది కాని ఈ హాట్ బ్యూటీకి తగిన గుర్తింపు అయితే తీసుకురాలేదు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: