ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఒక్కోసారి సినిమా నటులు కొన్ని కొన్ని విషయాల్లో అనుకోకుండా కొన్ని తప్పులు చేసి అడ్డంగా బుక్కయి పోతారు. అలాంటి సంఘటన ఒక పెద్ద ఇంకా మంచి పేరున్న స్టార్ విషయంలో జరిగింది. జరిగిన విషయానికి ఆ హీరో క్షమాపణ చెప్పిన కాని అతని పై వివాదం ఆగడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే....పుట్టిన రోజు వేళ  కేక్‌ కట్‌ చేయమంటే.. ఎవరైనా చిన్న చాకు లేదంటే పెద్ద చాకు తీసుకొస్తారు. కానీ ఏకంగా రాజులు వాడే పెద్ద కత్తి తీసుకొస్తారా?.. అలా కేక్‌ చేసేది చాలా తక్కువ. అయినా అలా కేక్‌ కట్‌ చేస్తే… పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ మధ్య ఎవరో ఇలా చేసి అరెస్టు అయ్యారు కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి అదే పని చేశాడు కాబట్టి. ఇటీవల పుట్టిన రోజు సందర్భంగా విజయ్‌ సేతుపతి.. అభిమానుల సమక్షంలో తల్వార్‌తో కేక్‌ కట్‌ చేశాడు.

ఆ ఫొటోలు వైరల్‌ కావడంతో క్షమాపణలు కూడా చెప్పాడు.విజయ్‌ సేతుపతి తన పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా ప్రయత్నించి విమర్శల పాలైన విషయం తెలిసిందే. దానికి కారణం ఖడ్గం (తల్వార్‌)తో కేక్‌ కట్‌ చేయడమే. ఆ ఫొటో వైరల్‌ కావడంతో నెటిజన్లు నోళ్లకు పని చెప్పడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో  నెటిజన్ల కామెంట్లు కూడా పెరిగాయి. ‘‘గతంలో కొందరు సంఘ విద్రోహశక్తులు ఇలాగే చేసినందుకు వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మరి ప్రముఖుల విషయంలో ఆ న్యాయం వర్తించదా..?’’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ విషయంలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో విజయ్‌ సేతుపతి సమాధానమిచ్చాడు.‘‘పుట్టిన రోజు సందర్భంగా పెద్ద కత్తితో కేకు కోయడం వివాదానికి దారితీసింది. నేను ప్రస్తుతం పొన్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఖడ్గానికి చాలా ప్రాముఖ్య తుంది. అందుకే చిత్రబృందం నాతో తల్వార్‌ను పట్టించి కేక్‌ కట్‌ చేయించింది. అది ఇప్పుడు విమర్శలకు దారి తీసింది.

ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి’’ అని విజయ్‌ సేతుపతి పోస్ట్ ‌ చేశాడు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: