కరోనా పరిస్థితులు కొంతవరకు అదుపులోకి వచ్చిన తరువాత ఓపెన్ అయిన ధియేటర్స్ కు సంక్రాంతి పండుగ సీజన్ కలిసి రావడంతో కరోనా బయాలను పక్కకు పెట్టి ప్రేక్షకులు ధియేటర్స్ కు రావడంతో ధియేటర్లు అన్నీ కొంతవరకు కళకళలాడాయి. అయితే 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనల వల్ల ఈసారి సంక్రాంతి సీజన్ లో విడుదల అయిన పండుగ సినిమాలకు చెప్పుకోతగ్గ స్థాయిలో కలిసిరాలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి.


పండుగ సీజన్ కు విడుదలైన సినిమాలకు వచ్చిన ప్రేక్షకులలో ఎక్కువ శాతం మంది 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు మాత్రమే  కనిపించారని 50 సంవత్సరాలు దాటినా వ్యక్తులు అదేవిధంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఇంకా సినిమాలకు దూరంగానే ఉన్నారు అన్న అంచనాలు వస్తున్నాయి. కేవలం సంక్రాంతి పండుగ సీజన్ కలిసి వచ్చింది కాబట్టి ఈమాత్రం హడావిడి అయినా సినిమా ధియేటర్ల దగ్గర కనిపించిందని ఇప్పుడు పండుగ సీజన్ పూర్తి అయిన తరువాత ధియేటర్లలో ప్రేక్షకులు కనిపించడం చాల కష్టం అన్నఅంచనాలకు ఇండస్ట్రీ వర్గాలు వచ్చాయి.


టాప్ హీరోలు నటించే 100 కోట్ల బడ్జెట్ సినిమాలకు ఈకలక్షన్స్ ఏమాత్రం సరిపోవని అంటున్నారు. సంక్రాంతి సీజన్ కు విడుదలైన నాలుగు సినిమాల ధియేటర్ హక్కులను 60 కోట్ల రేంజ్ లో అమ్మకం అయితే ఇప్పటివరకు ఈ పండుగ సీజన్ కలిసి వచ్చిన గ్రాస్ కలక్షన్స్ 80 కోట్లు దాటలేదు అన్న అంచనాలు వస్తున్నాయి.


ఈసారి సంక్రాంతి సీజన్ కు విడుదలైన పండుగ సినిమాలు అన్నింటినీ బయ్యర్లకు అతి తక్కువ రేట్లకు అమ్మారు. దీనితో వస్తున్న ఒక మోస్తరు కలక్షన్స్ వలన కొంతవరకు బయ్యర్లు గట్టెక్కుతారు కానీ సంక్రాంతి తరువాత మొదలయ్యే ఈ వారంలో ఈసంక్రాంతి సినిమాలకు వచ్చే కలక్షన్స్ ను బట్టి ఎంతవరకు బయ్యర్లు గట్టెక్కుతారు అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పండుగ సీజన్ లో వచ్చిన సినిమాలకే ఇలాంటి పరిస్థితి ఉంటే పండుగ అయిన తరువాత ఈ నెలలో విడుదల కాబోతున్న మరికొన్ని సినిమాలకు కనీసపు కలక్షన్స్ వస్తాయా ? రావా అన్న భయంలో ఇండస్ట్రీ వర్గాలుమదనపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: