ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రదీప్ మాచిరాజు ఒక డాన్స్ రియాలిటీ షోలో డాన్సర్ గా చేసి ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతున్నాడు. ఇక యాంకర్ ప్రదీప్ గతంలో కొన్ని సినిమాలలో సహా నటుడిగా కూడా నటించాడు. ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రదీప్ ని హీరోగా పెట్టి దర్శకుడు మున్నా ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’ అనే సినిమా తీశాడు.ఇక ఈ సినిమాలో తలపతి విజయ్ నటించిన "బిగిల్" సినిమాలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న  అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది.ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా మామలుగా  గతేడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. కానీ కరోనా వైరస్ వలన ఏర్పడిన  లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

 ఇన్నాళ్లకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జనవరి 29న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. పవిత్రమైన ప్రేమ కథ ఒకటి కాగా.. ఈ జనరేషన్ కి తగ్గట్లుగా అల్లరి ప్రేమ వ్యవహారం రెండోది. ట్రైలర్ లో ఎక్కువగా ఈ జనరేషన్ కి చెందిన ప్రేమ కథనే చూపించారు. కాలేజీలో కొన్ని ఫన్ డైలాగులు, హీరో-హీరోయిన్ మధ్య గొడవలను ట్రైలర్ లో చూపించారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన కథకు ఫాంటసీను కూడా జోడించారు. ట్రైలర్ తో కొంతవరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్వీ బాబు సినిమాను నిర్మించారు.గీతా ఆర్ట్స్,యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: