ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రతి వారం కూడా జబర్దస్త్ ప్రోగ్రాం అటు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  ఇక ఎంత అలిసిపోయినప్పటికీ తమ అలసట మొత్తం తీర్చుకోవడానికి కడుపుబ్బా కాసేపు నవ్వుకోవడానికి ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు  జబర్దస్త్ ప్రోగ్రాం చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఇక నేటి రోజుల్లో అయితే జబర్దస్త్ నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.  ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ టాప్ కామెడీ షోగా  కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే  జబర్దస్త్ లోని కమెడియన్స్ అందరూ కూడా ప్రతివారం సరికొత్త స్కిట్ లతో  తెర మీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ అంటే బుల్లితెర ప్రేక్షకులు అందరూ తెగ ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఊహకందని పంచులు.. ఎంతోమంది గెస్టు లతో హైపర్ ఆది స్కిట్ ప్రతి వారం కూడా అటు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. సాధారణంగా స్కిట్ లో అవసరమైన సమయంలో జడ్జిగా ఉన్న రోజా ఇక కంటెస్టెంట్స్ తో కలిసి కామెడీ పంచుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 కాగా ఇటీవలే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రోమో  లో భాగంగా హైపర్ ఆది చేసిన స్కిట్ స్పెషల్ అట్రాక్షన్ గా  నిలిచింది. అయితే ప్రోమో లో భాగంగా హైపర్ ఆది టీం రాజా సినిమా స్పూఫ్  చేశారు. ఈ క్రమంలోనే రోజా  సౌందర్య పాత్రలో నటించగా ఇక వెంకటేష్ పాత్రలో ఆది  నటిస్తాడు. ఈ క్రమంలోనే సినిమా లో భాగంగా ఒక కార్యక్రమంలో సౌందర్య మాట్లాడే సన్నివేశాన్ని గా స్పూఫ్  తీసుకున్నారు. తాను ఈ  పొజిషన్ లో ఉండడానికి కారణం అంటూ  రోజా మాట్లాడుతున్న సమయంలో ఇక వెంకటేష్ లాగా ఫీల్ అయిపోతాడు హైపర్ ఆది. తాను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం తనకు ముందు ఉన్న కెమెరామెన్ అంటూ పంచ్ వేస్తుంది రోజు. అందరు నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: