పూజ హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమా కి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.. ఓ సాంగ్ కూడా రిలీజ్ అయ్యి మంచి స్పందన రాబట్టుకుంది. అయితే ఈ సినిమా పూర్తయ్యి చాలారోజులు అవుతున్న థియేటర్లలో రిలీజ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి కి రాబోతుందని వార్తలు వచ్చినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా రిలీజ్ చేయకపోవడమే మంచిదని ఆగిపోయారు.. 50% ఆక్యుపెన్సీ, కరోనా ప్రభావం వలన ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అన్నది ఇంకా స్పష్టంగా తెలీట్లేదు.. ఈ కారణం వల్ల రిలీజ్ ని ఇంకొన్ని రోజులు పోస్ట్ పోనే చేయాలనీ భావిస్తున్నారట టీం..
మే లో ఈ సినిమా ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.. జనవర్తి లో నాలుగు సినిమాలు రిలీజ్ చేద్దామంటే ఇప్పటికే నాలుగు సినిమాలు పోటీ లోఉన్నాయి.. పోనీ ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామంటే.. ‘ఉప్పెన, ఏ1 ఎక్స్ ప్రెస్’ మార్చిలో ‘రంగ్ దే లవ్ స్టోరీ’. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నాని ‘టక్ జగదీష్’ డబ్బింగ్ చిత్రం ‘కెజిఎఫ్ 2’ రాబోతున్నాయి. అందుకే సోలోగా మేలో వస్తే బాగుంటుందని భావిస్తున్నారట మేకర్స్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి