తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరును సంపాదించుకున్నా అక్కినేని నాగ చైతన్యకు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయం గురించి చైతన్య ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు నాగచైతన్య బాలీవుడ్ లో చై ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నారనే విషయం గురించి ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.                                          

బాలీవుడ్ ఇండస్ట్రీ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు సంపాదించుకున్న అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో  తెరకెక్కుతున్న చిత్రం "లాల్ సింగ్ చద్దా" హాలీవుడ్ లో ఘన విజయాన్ని సాధించిన" ఫారెస్ట్ గంప్"చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న  "లాల్ సింగ్ చద్దా"ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించడానికి చిత్రబృందం టాలీవుడ్ యువ హీరో చైతన్యను సంప్రదించినట్టు తెలుస్తోంది.

చైతన్యకి పాత్ర నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిలో ఎంత వరకు నిజం ఉందనే విషయం గురించి చిత్ర బృందం అధికార ప్రకటన చేయాల్సి ఉంది. అమీర్ నటిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఓ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం విజయ్ సేతుపతికి డేట్స్ సమస్య ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరికొందరు మాత్రంవిజయ్ సేతుపతికి అమీర్ ఖాన్ తో ఉన్న అభిప్రాయ భేదాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: