1. అడవి రాముడు :
1977లో ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు సినిమా మొదటిసారి ఒక థియేటర్లో మొత్తం పది లక్షల షేర్ ను వసూలు చేసింది. అది హైదరాబాద్ లోని వెంకటేష థియేటర్ లో మొత్తం 176 రోజులు ఆడి పది లక్షలకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది అడవి రాముడు.
2. ప్రేమాభిషేకం:
1981లో రిలీజ్ అయిన ప్రేమాభిషేకం సినిమా, విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ లో 303 రోజులకు గాను మొత్తం 16 లక్షల రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
3. సింహాసనం :
1986లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం హైదరాబాద్ లోని దేవి థియేటర్ లో 104 రోజులకు గాను,19 లక్షల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది.
4. గీతాంజలి:
1989లో నాగార్జున నటించిన ఈచిత్రం హైదరాబాదులోని దేవి థియేటర్ లో విడుదల అయ్యి, వంద రోజులకు గాను 20 లక్షలు వసూలు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది.
5. శివ :
1989 లో నాగార్జున నటించిన శివ హైదరాబాదులోని దేవి థియేటర్ లో 155 రోజులు ఆడి, 33.5 లక్షల రూపాయలను వసూలు చేసింది.
6. బొబ్బిలి రాజా :
1990లో వెంకటేష్ నటించిన ఈ చిత్రం హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో రెండు వందల పది రోజుల గానూ 34 లక్షల రూపాయలను వసూలు చేసింది.
7. ఘరానా మొగుడు :
1992 లో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో 122 రోజులు ఆడి,42 లక్షల రూపాయలను వసూలు చేసింది.
8. అల్లుడా మజాకా :
ఘరానా మొగుడు సినిమాతో తన క్రియేట్ చేసిన రికార్డును,చిరంజీవియే అల్లుడా మజాకా సినిమా ద్వారా బ్రేక్ చేశాడు. ఈ సినిమా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో విడుదలయ్యింది. వంద రోజులకు 51 లక్షల రూపాయలను వసూలు చేసింది.
9. పెళ్లి సందడి:
1996 లో రిలీజ్ అయిన ఈ సినిమా హైదరాబాదులోని సంధ్య థియేటర్లో 275 రోజులు ఆడి, 95 లక్షల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
10. నిన్నే పెళ్ళాడతా :
అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఒక్కసారిగా బద్దలుకొట్టి,మొత్తం 185 రోజులకు గాను ఒక కోటి 3 లక్షల రూపాయలను వసూలు చేసి, మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. అది కూడా హైదరాబాద్ లోని దేవి థియేటర్ లో ఆడి ఒక సంచలనం సృష్టించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి