నందిత శ్వేత... టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ "ఎక్కడికి పోతావు చిన్నవాడా " సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతగానో ఆకట్టుకుంది.... ఆ సినిమాలో ఆమె నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అందం అభినయం రెండు వున్నా కాని ఈ ముద్దుగుమ్మ కి అవకాశాలు అయితే పెద్దగా ఏమి రావట్లేదు.. ఇక ఈ హాట్ బ్యూటీ ప్రధాన పాత్రలో చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అక్షర”. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను వేలెత్తిచూపే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ & ప్రమోషన్స్ సినిమాపై ఆసక్తి కలిగించి అంచనాలు క్రియేట్ చేశాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..!!


ఇక ఈ సినిమాలో ఫిజిక్స్ టీచర్ గా నటించిన నందితశ్వేత నటన ఎంతో ఆకట్టుకుందని టాక్ వినిపిస్తుంది..ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె క్యారెక్టర్ రెగ్యులర్ గానే ఉన్నా కాని ఎంతో వైవిధ్యంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందట....హర్షవర్ధన్ ఓ బాధ్యతాయుతమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక నెగటివ్ పాత్రలో నటించిన సంజయ్ స్వరూప్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక నరేష్ బొబ్బిలి అందించిన పాటలు బాగానే వున్నాయి కాని నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయిందట...



ఇక డైలాగ్ రైటర్ గా పేరు తెచ్చుకున్న చిన్ని కృష్ణ దర్శకత్వం విషయానికి వస్తే థ్రిల్లర్ కి క్లైమాక్స్ & ఫ్లాష్ బ్యాక్ అనేవి చాలా కీలకం. ఈ రెంటినీ ఒడిసిపట్టుకోవడంలో చిన్నికృష్ణ గాడితప్పాడు. కథలో మంచి ఇంటెన్సిటీ ఉంది, అయితే ఆ ఇంటెన్సిటీ కథనలో మిస్ అయ్యింది. ఫస్టాఫ్ మొత్తం అనవసరమైన లవ్ & కామెడీ ట్రాక్ లతో నింపేశాడు. సెకండాఫ్ డీసెంట్ గా బాగానే ఉందని సమాచారం అందుతుంది. ఇక ఓవరాల్ గా సినిమా యావరేజ్ అని సమాచారం అందుతుంది...ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి.....



మరింత సమాచారం తెలుసుకోండి: