ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ "మళ్ళీ రావా " వంటి హిట్ సినిమా తరువాత సుధీర్ఘ విరామం తీసుకోని నటించిన చిత్రం "కపటదారి" క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్' బ్యానర్ పై జి.ధనంజయన్, లలిత ధనంజయన్ ల నిర్మాణంలో ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.హీరో సుమంత్ సరసన నందిత శ్వేతా జంటగా నటించింది.ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగానే ఉండడంతో ఈ సినిమా పై అందరి ఫోకస్ పడింది.హీరో సుమంత్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.కన్నడంలో సూపర్ హిట్ అయిన 'కవలుదారి' కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటిరోజు స్టోరీ బాగుందంటూ మంచి పాజిటివ్ టాకే వచ్చింది. అయినప్పటికీ వున్న సుమంత్ బ్యాడ్ ఫామ్ అలాగే మునుపటి క్రేజ్ లేని కారణంగా కలెక్షన్లు ఏమాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది...


ఇక ఈ సినిమా ఫైనల్ గా ఎంత వసూలు చేసిందంటే... 'కపటదారి' చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.1.9కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఇక చాలా వరకూ ఈ చిత్రాన్ని నిర్మాతలు ఒన్ రిలీజ్ చేసుకున్నారు.అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలబడాలంటే.. రూ.2.2కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఫుల్ రన్లో ఈ చిత్రం కేవలం 0.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఇక దీంతో బయ్యర్లకు రూ.1.5కోట్ల వరకూ నష్టాలను మిగిల్చింది.అలాగే ఈ సినిమా సుమంత్ మరో ప్లాప్ మూవీ గా నిలిచింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి.....

మరింత సమాచారం తెలుసుకోండి: