తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ గా ఒక్కో సినిమాతో మరింత మంచి పేరు దక్కించుకుంటూ కొనసాగుతున్న వారిలో యువ భామ సాయి పల్లవి కూడా ఒకరు అని చెప్పకతప్పదు. తొలిసారిగా శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవిమూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా సాయి పల్లవి కి మంచి పేరు వచ్చింది. అనంతరం ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగుతున్న సాయి పల్లవి ఆపై టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పలువురు నటుల సరసన నటించింది.

ఇక ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ విరాట పర్వం తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తొలిసారిగా నాగ చైతన్య తో కలిసి లవ్ స్టోరీ అనే మూవీ లో కూడా ఆమె నటిస్తోంది. కాగా ఈ రెండు సినిమాలపై సాయి పల్లవి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ రెండు సినిమాల నుండి రెండు లిరికల్ సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రస్తుతం మంచి వ్యూస్, లైక్స్ తో కొనసాగుతున్నాయి. అయితే వీటిలో మరీ ముఖ్యంగా లవ్ స్టోరీ మూవీ నుండి లేడీ ఓరియెంటెడ్ సాంగ్ అయిన సారంగ దరియా సాంగ్ కి యువత నుండి విశేషమైన రెస్పాన్స్ లభిస్తోంది.

ఆకట్టుకునే లిరిక్స్ తో అలరించే ట్యూన్ తో సాగె ఈ సాంగ్ కి సాయి పల్లవి డాన్స్ ని అదరగొట్టినట్లు దీని యొక్క లిరికల్ సాంగ్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. కాగా ఈ లిరికల్ సాంగ్ ప్రస్తుతం మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళుతోంది. ఇటీవల సాయి పల్లవి నటించిన పలు సినిమాల్లోని ఆమె సాంగ్స్ కి మిలియన్స్ వ్యూ రావడంతో పాటు రౌడీ బేబీ సాంగ్ అయితే ఏకంగా 1 బిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ విధంగా వరుసగా తన సినిమాల్లోని సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటూ కొనసాగుతున్న సాయి పల్లవి పేరు ఇకపై రికార్డుల పల్లవి అని, రాబోయే రోజుల్లో కూడా ఆమె మరిన్ని యూట్యూబ్ రికార్డ్స్ ని దక్కించుకుంటుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ సోషల్ మీడియా అకౌంట్స్ లో కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: