పూరీ జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రోమాంటిక్' ఈ సినిమాను యువ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలా వరకు గోవాలో చిత్రీకరణ జరుపుకుంది.ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే పూరీ అందిస్తున్నాడు. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జూన్‌ 18న థియేటర్లలో సినిమా రిలీజ్‌ కానున్నట్లు సోమవారం హీరో ఆకాష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించాడు.

అయితే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ గతేడాది మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా నిలిచిపోయింది. రమ్య కృష్ణ, మందిరా బేడి, మకరంద్‌ దేశ్‌పాండే, దివ్యదర్శిని తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రొమాంటిక్‌ సినిమా టీజర్‌ను పూరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

రొమాంటిక్ హీరో ఆకాష్‌ "ఆంధ్రాపోరి" చిత్రంతో టాలీవుడ్‌లోకి  ఎం‍ట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘మెహబూబా’ను ఆకాశ్ సోలో హీరోగా అద్భుతంగా నటించినప్పటికీ.
సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక ఆకాశ్ హీరోగా నటించిన  చిత్రం ‘రొమాంటిక్’భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా ఆకాష్ పూరి హీరోగా జార్జిరెడ్డి మూవీని తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘చోర్ బజార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇలా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ విజయం తన ఖాతాలో చేసుకోలేక పోతున్నాడు రొమాంటిక్ హీరో ఆకాష్ పూరి

మరింత సమాచారం తెలుసుకోండి: