పవర్‌స్టార్ తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి రోజున ఎవరు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.ఆ రోజు సందర్భంగా పవర్‌స్టార్
పవన్ కళ్యాణ్, డైరెక్టర్
క్రిష్ కాంబినేషన్లో మెగా
సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర
నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీకి ‘హరి హర వీరమల్లు’ అనే పేరు ఫిక్స్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు.పవన్ నటిస్తున్న 27వ
సినిమా ఇది. ఈ సినిమాలో
పవన్ వజ్రాల
దొంగ ‘హరి హర వీరమల్లు’ పాత్రలో సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ఇస్మార్ట్
బ్యూటీ నిధి అగర్వాల్, మహారాణి పాత్రలో కనిపించనుంది. పవర్‌స్టార్ కెరీర్లో మొట్టమొదటిసారిగా పాన్
ఇండియా స్థాయిలో
హిందీ,
తమిళ్,
కన్నడ భాషల్లో భారీగా విడుదల కానుంది.2022 సంక్రాంతికి
పవన్ ‘హరి హర వీరమల్లు’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకి మాటలు సాయి
మాధవ్ బుర్రా, పాటలు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి,
చంద్రబోస్ అందిస్తున్నారు. అలాగే సంగీతం ఎం.ఎం.కీరవాణి చుసుకోవడంతో ఈ
సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక కెమెరా : జ్ఞానశేఖర్ మరియు ఎడిటింగ్ శ్రవణ్ , రామ్-లక్ష్మణ్, షామ్ కౌశల్,
దిలీప్ సుబ్బరాయన్ ఇలా చాలామంది టాలెంటెడ్ వ్యక్తులు పని చేస్తున్నారు ఈ సినిమాకి.అయితే ఈ సినిమా
క్రిష్ మొదటిగా
వరుణ్ తేజ్ కోసం రాసుకున్నారట . అయితే ఆయన డేట్స్ కుదురకపోయేసరికి పవన్ తో ఈ
సినిమా చేస్తున్నారు. అయితే
పవన్ కళ్యాణ్ అసలు ఇప్పటిదాకా చేయని ఒక కొత్త పాత్రలో
పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. దానితో ఆయన అభిమానులు ఈ
సినిమా టీజర్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో ఆయన భారీ రేంజ్ లో పోరాటాలు చేయబోతున్నారు అని టాక్. వచ్చే
సంక్రాంతి ఈ
సినిమా ఘనంగా విడుదల కాబోతున్నది. ఈ సినిమాతో పాటు
మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా విడుదల కాబోతుంది.