ఏపీలో ప్రస్తుతం తిరుపతి ఎన్నికల సందడి నెలకొంది. వైసీపీ స్థానిక ఎన్నికల్లో చూపించిన ఆధిక్యాన్ని కొనసాగించేందుకు తన అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అంతే కాకుండా అన్ని పార్టీల అభ్యర్థులు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలలో తమ ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అధికార వైసీపీ ఎన్నికల సందర్భంలో కరెక్ట్ గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి హెయిర్ ఇష్యూను తెరపైకి తీసుకురావడం. అయితే దానితో పాటుగా గతంలో ఏదైతే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణ పింక్ డైమండ్ కావచ్చు మరియు బూందీ పోర్టు తవ్వుకుని అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని... స్వామి వారి నగల్ని ఎత్తుకు పోయారు అన్న ఆరోపణ కావచ్చు... ఇవన్నీ చర్చకు తీసుకొచ్చింది ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ. 

వీరు ఇప్పుడు సెంటిమెంట్లను టచ్ చేస్తూ అంటే అక్కడ మోసం చేస్తున్నారు అన్న నిందను వేసింది. ఈ సందర్భంలో డైరెక్టుగా ఇప్పుడు వైసీపీ అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పుడు వెంటనే అక్కడ ఏదైతే మణిపూర్ లో ఉన్నటువంటి రిపోర్టును తీసుకువచ్చింది. దాని ఆధారంగా... ముందైతే మొదటి రోజున ఆవేశంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. మేము వేలం వేస్తాము కానీ దానితో మాకేం సంబంధం లేదు అని చెప్పడం జరిగింది.  ఒక ప్రముఖ వార్త టీవీ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ విషయాన్ని హైలెట్ చేశారు.   టీడీపీ ఆరోపిస్తున్న విషయంలో వాస్తవం లేదు. ప్రాసెసింగ్ చేయనటువంటి హెయిర్ అది. తిరుపతిలో తీసుకునేటటువంటి హెయిర్  ప్రాసెసింగ్ చేసి తీసుకోబడుతుంది..

కాబట్టి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధం లేదు. అంతే కాకుండా వారు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో కూడా తిరుపతి అని రాయలేదు అని కొత్త వాదనను తీసుకు వచ్చింది. ఆ సంబంధిత డాక్యుమెంట్ ను జేఈవో ధర్మారెడ్డి గారి ద్వారా రిలీజ్ చేసి దాని ప్రచారంలోకి తీసుకువచ్చారు. తద్వారా ఇది తెలుగుదేశం పార్టీ కావాలని వ్యూహాత్మకంగా మమ్మల్ని దెబ్బతీస్తోందని భావిస్తూ అధికార యంత్రాంగం ద్వారా ఆన్సర్ చేయించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్స్ పై కేసులు పెట్టడం వంటి వాటితో తిప్పికొట్టింది అధికార పార్టీ. మరి ఈ విషయాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో జరగనున్న ఎన్నికలో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: