అయితే జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ లో రాంప్రసాద్ గెటప్ శీను లు ఉన్నారు. అయితే ఇక సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను రాంప్రసాద్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి గురించి అసలు ప్రస్తావన తీసుకు రావడం లేదు. అయితే రష్మి సుడిగాలి సుధీర్ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని అటు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఎప్పుడూ స్టేజిపై కనిపించిన కూడా అటు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతూ వుంటారు. ఇకపోతే సుడిగాలి సుధీర్ కి త్వరలో పెళ్లి కాబోతున్నాడా అంటే ప్రస్తుతం సిచువేషన్ చూస్తే మాత్రం అవును అనే అంటున్నారు ప్రేక్షకులు.
ఎందుకంటే ఇటీవల ఈ టీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి హీరో నితిన్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో సార్ మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతాడు సుడిగాలి సుధీర్. బాగుంది నువ్వు కూడా రా అంటూ నితిన్ చెబుతాడు. ఇటీవలే ఉగాది సందర్భంగా ఉగాది జాతిరత్నాలు అనే ఈవెంట్ ప్లాన్ చేసారూ. ఈవెంట్లో భాగంగా అటు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలోనే గెస్ట్ గా వచ్చిన నాచురల్ స్టార్ నాని నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతాడు సుడిగాలి సుదీర్. ఇలా అందరినీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతున్నాడు అంటే త్వరలో సుధీర్ పెళ్లి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడేమో అని అందరూ భావిస్తున్నారు ప్రేక్షకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి