ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రతి షో లో కూడా ఇదే పాటను ఎక్కువగా ప్లే చేస్తున్నారు. అంతే కాదు ఎంతో మంది ఈ పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అదరగొడుతున్నారు. అటు సోషల్ మీడియాలో ఇటు బుల్లితెరపై.. లవ్ స్టోరీ సినిమా లోని కుడి భుజం కడప అనే పాట ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ముఖ్యంగా ఈ పాటపై సాయి పల్లవి డాన్స్ చేసి స్టెప్స్ ఇరగ దీయడం అయితే అటు ప్రేక్షకుల్లో మరింత ఆకర్షిస్తుంది. అయితే ఇటీవలే ఈ పాట పై ఢీ షో లో టీమ్ లీడర్లు గా ఉన్న రష్మీ తో పాటు దీపికా కూడా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యానికి గురి చేశారు.
ఇక మరికొన్ని రోజుల్లో ఉగాది పండుగ రానున్న నేపథ్యంలో ఈటీవీ యాజమాన్యం ఉగాదికి.. ఉగాది జాతిరత్నాలు అనే ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. స్పెషల్ ఈవెంట్ లో భాగంగా ఇక బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సరికొత్త ఎంటర్టైన్మెంట్ పెంచేందుకు అంతా సిద్ధం చేసింది ఈ టీవీ యాజమాన్యం. ఈ క్రమంలోనే ఇటీవలే పాపులర్ గా మారిపోయిన కుడి భుజం మీద కడవ అనే పాట పై రష్మి గౌతమ్ తో పాటు.. ఢీ షో లో టీమ్ లీడర్ గా ఉన్న దీపికా కూడా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టారు. ఈ క్రమంలోనే జడ్జిగా వచ్చిన ఉదయభాను ఇద్దరిని చూస్తే ఏకంగా సాయిపల్లవి కనిపించింది అంటూ వారిద్దరిని పొగడ్తలతో ముంచెత్తింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి