మనకు దక్షిణాదిలో నాలుగు సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి. అవి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ మరియు శాండల్ వుడ్. కానీ ఏ సినీ పరిశ్రమను తీసుకున్న అక్కడి వారి ప్రజలకు స్థానిక హీరోలంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అది సహజం. పక్క ఇండస్ట్రీ హీరోలంటే కొంచెం తక్కువగానే ఆసక్తి ఉంటుంది. అలాంటిది మన తెలుగు ప్రేక్షకుల విషయానికొస్తే మన వారిని ఆధరిస్తూనే తమిళ సినీ ఇండస్ట్రీ హీరోలను సైతం ఆదరిస్తున్నారు. తమిళ హీరోల్లో ముఖ్యంగా రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఎన్నో సంవత్సరాల నుండి తెలుగులో వారి సినిమాలను చేస్తూ తెలుగు ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. వీరి తరువాత సూర్య, అజిత్ మరియు మరి కొంత మంది కుర్ర హీరోలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు..

దీనిని బట్టి చూస్తే మన తెలుగు ప్రేక్షకులు తమిళ హీరోలను ఆదరించినంతగా మరే ఇతర సినిమా పరిశ్రమ హీరోలను ఆదరించలేకపోతున్నారు. అయితే కొంతమంది మలయాళం మరియు కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మన తెలుగు వారి ముందుకొచ్చారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. తెలుగు వారికి కన్నడ హీరోలు అసలు తెలీకపోవడం ప్రధాన కారణం కావొచ్చు. అయితే కెజిఎఫ్ మూవీ తరువాత కనడ సినిమా గురించి కొంతవరకు మన తెలుగు వారికి తెలిసింది. కెజిఎఫ్ ఇచ్చిన విజయంతో కన్నడ హీరోలు వారి సినిమాలను తెలుగులో డబ్ చేశారు. ఇటీవల వరుసగా మూడు కన్నడ సినిమాలు మన ముందుకొచ్చాయి. వీరిలో ముఖ్యంగా దర్శన్ మరియు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లు వారి సినిమాలను తెలుగులో విడుదల చేశారు.

ఈ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేశారు, అయినా కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వీరి సినిమాలు విఫలమయ్యాయి. హిట్ కాదు కదా కనీసం...సరైన ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాలు దక్కించుకోలేకపోయాయి.  అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన పునీత్ రాజ్ కుమార్ యువరత్న సినిమా దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. ఈ సినిమా కథ పాత తెలుగు మాస్ కథలాగే ఉందని కొందరు చెబుతున్నారు. దేనికిని బట్టి చూస్తే తెలుగు ప్రేక్షకులు ఇతర ఇండస్ట్రీ హీరోలను ఆదరించాలంటే కెజిఎఫ్ లాంటి సినిమాలను మరియు మంచి అద్భుతమైన కథలను తెరకెక్కించాలి అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: